భార్యతో గొడవ.. భర్త చేసిన పనికి ఉలిక్కిపడిన స్థానికులు?

praveen
భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. ఒకసారి మూడుముళ్ల బంధంతో వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన తర్వాత.. తుది శ్వాస వరకు ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి. ఎన్ని గొడవలు వచ్చిన సర్దుకుపోతూ ఇక జీవితాన్ని పిల్ల పాపలతో సంతోషంగా గడపాలి. కానీ ఇటీవల కాలంలో భార్యాభర్తలలో మాత్రం అన్యోన్యత అని కనిపించడం లేదు. ఎందుకంటే ఏకంగా చిన్న చిన్న కారణాలతోనే భార్యాభర్తలు విడిపోతున్న ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయ్.


 అయితే ఇలా చిన్నచిన్న గొడవలతో భార్యాభర్తలు విడిపోయి ఎవరిదారు వారు చూసుకున్న పర్వాలేదు. కానీ కొంతమంది మాత్రం ఏకంగా ఒకరిపై ఒకరు కోపం పెంచుకుంటూ ప్రాణాలు సైతం తీయడానికి వెనకడుగు వేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కి పడేలా చేస్తూ ఉన్నాయి. వైవాహిక బంధం పై ప్రతి ఒక్కరిలో ఉన్న ఆలోచనలు మార్చేస్తున్నాయి అని చెప్పాలి. ఇటీవల ఢిల్లీలోనే భరత్ నగర్ లో కూడా ఇలాంటి ఒక దారుణ ఘటన జరిగింది.


 జేజే కాలనీకి చెందిన రాకేష్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇటీవల తన భార్యతో గొడవపడ్డాడు రాకేష్. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అయితే భార్య మీద ఉన్న కోపాన్ని పిల్లల మీద చూపించాడు. ఐదేళ్ల పెద్ద కుమారుడు రెండేళ్ల చిన్న కుమారుడుతో కలిసి రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఆ తర్వాత పదునైన కత్తితో ఇద్దరు కుమారుల గొంతు కోసి అదే కత్తితో తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం బయటికి వచ్చి భార్యకు అసలు విషయం చెప్పాడు. దీంతో ఆమె వెంటనే కుమారులను ఆసుపత్రికి తరలించగా రెండేళ్లు చిన్న కుమారుడు మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. ఇక ఈ ఘటనలో రాకేష్ అతని పెద్ద కుమారుడు పరిస్థితి కూడా విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: