ఫైనల్ చూస్తుంటే.. టీవీ ఆపేసాడని.. కొడుకుని చంపేసాడు?

praveen
ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఎంత అద్భుతమైన ప్రస్థానం కొనసాగించింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన జట్టు.. ఇక అంచనాలకు తగ్గట్లుగానే అదరగొట్టింది. వరుసగా విజయాలు సాధిస్తూ ఓటమి ఎరుగని జట్టుగా దూసుకుపోయింది అని చెప్పాలి. ఇక టీమ్ ఇండియా దూకుడు చూస్తే తప్పకుండా వరల్డ్ కప్ టైటిల్ ఎగరేసుకుపోవడం ఖాయమని క్రికెట్ ప్రపంచం మొత్తం గట్టిగా ఫిక్స్ అయింది. ఇలాంటి సమయంలో ఫైనల్ మ్యాచ్లో మాత్రం భారత జట్టుకు ఊహించని రీతిలో చేదు అనుభవం ఎదురయింది.


 ఏకంగా వరల్డ్ కప్ టైటిల్ విజేతగా నిలుస్తుంది అనుకున్న భారత జట్టు ఫైనల్ లో మాత్రం ఆస్ట్రేలియా టీం చేతిలో దారుణంగా ఓడిపోయింది. మరోసారి ఇక వరల్డ్ కప్ టైటిల్ గెలవడం అనేది భారత జట్టుకు కలగానే మిగిలిపోతుంది అని చెప్పాలి. ఈ ఓటమితో 140 కోట్ల మంది ఇండియన్స్ అందరూ కూడా అటు నిరాశలో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఉత్కంఠతో ప్రేక్షకులు అందరూ ఎంతలా టీవీలకు అతుక్కుపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ అలాంటి సమయంలో ఎవరైనా వచ్చి టీవీ ఆఫ్ చేశారంటే.. అగ్గిమీద గుగ్గిళం లాగా ఊగిపోయిన పరిస్థితి కనిపించింది.



 ఇక్కడ ఒక వ్యక్తి ఏకంగా ఫైనల్ మ్యాచ్ చూస్తున్న సమయంలో.. టీవీ ఆఫ్ చేశాడు. దీంతో ఏకంగా కన్న కొడుకుని దారుణంగా చంపేశాడు ఈ ఘటన. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో వెలుగులోకి వచ్చింది. తండ్రి గణేష్ ప్రసాద్ ను  వంట చేశాక మ్యాచ్ చూసుకోమని కుమారుడు దీపక్ కోరాడు. ఎంత చెప్పినా అటు గణేష్ మాత్రం వంట చేయకపోవడంతో విసిగిపోయిన దీపక్ చివరికి టీవీ ఆఫ్ చేసాడు. ఇక ఇదే విషయంపై దీపక్ తో వాగ్వాదానికి దిగాడు గణేష్ ప్రసాద్. ఈ క్రమంలోనే కోపంతో ఏకంగా కేబుల్ వైర్ తో కొడుకు గొంతు నులిమి చంపేసాడు. ఈ ఘటన సంచలనంగా మారింది. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: