వీధి రౌడీల్లా.. క్లాస్ రూమ్ లోనే తన్నుకున్న ఉపాధ్యాయులు?
ఇలాంటి టీచర్లను నమ్మా.. మా పిల్లలను స్కూల్ కి పంపిస్తుంది అని ఇక ఎంతోమంది పేరెంట్స్ కూడా అనుకుంటున్న పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఏకంగా విద్యార్థుల ముందు ఎంతో హుందాగా ప్రవర్తిస్తూ తమ దగ్గర చదువుకుంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా సత్ప్రవర్తన నేర్పాల్సిన ఉపాధ్యాయులు.. విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్న ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయ్. ఇటీవల కేరళలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఏకంగా విద్యార్థుల ముందే వీధి రౌడీల్లాగా టీచర్స్ దారుణంగా కొట్టుకున్న వీడియో ఒకటి ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.
ఎరవనూరులోని ఏయుపి స్కూల్లో ఒక మహిళా టీచర్ పనిచేస్తుంది. అయితే ఆమె భర్త మరో స్కూల్ టీచర్ గా పని చేస్తున్నాడు. అయితే ఇటీవల మహిళా టీచర్ స్కూల్లో ఒక విద్యార్థిని కొట్టింది. ఈ క్రమంలోనే అలా విద్యార్థులను కొట్టవద్దు అంటూ స్కూల్ మీటింగ్లో ఆ టీచర్ను మందలించారు. ఈ విషయం భర్తకు తెలిసి కోపంతో ఊగిపోయాడు. ఏకంగా భార్య పని చేస్తున్న స్కూలుకు వచ్చి మిగతా టీచర్లతో గొడవకు దిగాడు. మాట మాట పెరగడంతో ఒక ఉపాధ్యాయుడు మీద చేయి చేసుకున్నాడు అడ్డుకోబోయిన మరికొంతమంది టీచర్లపై కూడా దాడి చేశాడు అయితే స్కూల్ సిబ్బంది ఫిర్యాదుతో ఇలా దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు.