భర్త ఎక్కువ ప్రేమిస్తున్నాడని.. విడాకులు కోరిన భార్య?

praveen
నేటితరం వైవాహిక బంధానికి నిన్నటి తరం వైవాహిక బంధానికి తేడా చూస్తే నిన్నటి తరం దాంపత్య బంధమే బాగుందేమో అనే భావన ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంది. ఎందుకంటే ఒకసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత.. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఒకరికి ఒకరు తోడునీడగా ఉండేవారు. ఇక ఒక్కసారి మూడుముళ్ల బంధంతో ఒకటైన తర్వాత జీవితాంతం వారితోనే కలిసి ఉండాలి అనే భావించేవారు. కానీ నేటి రోజుల్లో ఇలాంటి ఆలోచన ఎక్కడ కనిపించడం లేదు. పెళ్లి అనేది కేవలం ఒక సాదాసీదా ఎలిమెంట్ గా మారిపోయింది. నచ్చితే పెళ్లి చేసుకోవడం నచ్చకపోతే విడాకులు ఇవ్వడం టక టక జరిగిపోతున్నాయ్.

 అది కూడా పెద్ద కారణాలతో కాదు ఐదు నిమిషాలు కూర్చుని మాట్లాడితే తీరిపోయే సమస్యలకు సైతం విడాకులు తీసుకొని విడిపోవడానికి సిద్ధమవుతున్నారు నేటి రోజుల్లో చాలామంది భార్య భర్తలు. ఇక ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందా అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది అని చెప్పాలి. అయితే ముంబై కు చెందిన లాయర్ తానియా కౌల్ తన వద్దకు విడాకుల కోసం వచ్చే జంటలు చెప్పిన వింతైన కారణాలను ఇటీవల సోషల్ మీడియాలో పంచుకున్నారు.

 సాధారణంగా భర్త ఎక్కువగా ప్రేమిస్తే అసలు గొడవ పడకుండా అన్నింటికీ సర్దుకుపోతే అమ్మాయికి అంతకంటే ఇంకేం కావాలి. కానీ ఇక్కడ ఒక అమ్మాయి భర్త ఇలా చేస్తున్నాడని విడాకులకు అప్లై చేసుకుందట. భర్త ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అస్సలు గొడవ పడటం లేదని.. విడాకులు కోరిందట. మరో చోట భర్త తన భార్య కాళ్లకు నమస్కరించడం లేదని డివర్స్ అడిగాడట  ఇక హనీమూన్ లో భార్య కురచ దుస్తులు వేసుకున్నందుకు విడిపోతాను అన్నాడట మరో భర్త. ఇలా తన దగ్గరికి విడాకుల కోసం భార్యాభర్తలు చెప్పిన వింతైన కారణాలను ఇటీవల వెల్లడించింది లాయర్ తానియా కౌల్. విడిపోవడానికి ఇలాంటి కారణాలు కూడా ఉంటాయా అని ఈ విషయం తెలిసి షాక్ అవుతున్నారు నెటిజెన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: