కూతురు బతికుండగానే.. పెద్దకర్మ చేసిన తండ్రి.. ఎందుకో తెలుసా?

praveen
అమ్మ చెల్లి అన్న తమ్ముడు ఇలా ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాల బంధాలు ఉంటాయి. అయితే ఇలాంటివి ఎన్ని బంధాలు ఉన్నా అటు తండ్రీ కూతుర్ల బంధం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే తన రక్తం పంచుకుని పుట్టిన కూతురిలో తన తల్లిని చూసుకుంటాడు తండ్రి. అదే సమయంలో ఇక తన తండ్రి తనకు సూపర్ హీరో అనుకుంటుంది కూతురు. ఇక వీరిద్దరి మధ్య బాండింగ్ ను మాటల్లో వర్ణించడం కూడా ఎంతో కష్టమని చెప్పాలి. అయితే కొడుకు విషయంలో కఠినంగా ఉండే తండ్రి అటు కూతురు విషయంలో మాత్రం.. అంత కఠినంగా ఉండలేడు. కూతురికి ఏం కావాలన్నా ఇచ్చి ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు అని చెప్పాలి.


 కూతురికి ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు. కానీ ఇక్కడ ఒక తండ్రి కూతురు విషయంలో చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏకంగా కూతురు బతికుండగానే రక్తం పంచుకుని పుట్టిన కూతురికి పెద్దకర్మ నిర్వహించాడు ఇక్కడ ఒక తండ్రి. నిజాంబాద్ లో ఈ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే మహేష్ అనే వ్యక్తి కూతురు గత కొంతకాలం నుంచి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. ఇటీవలే అతనితోనే ప్రేమ వివాహం కూడా జరిగింది. దీంతో ఇక తల్లిదండ్రులను కాదని వెళ్ళిపోయింది. దీంతో కూతురుపై కోపం పెంచుకున్న తండ్రి ప్రతీకారం తీర్చుకునేందుకు బతికుండగానే పెద్దకర్మ చేశాడు.



 తన కూతురు చనిపోయింది అంటూ చెబుతూ ఒక ఫ్లెక్సీ ని కూడా ఏర్పాటు చేశాడు ఆ తండ్రి. అంతేకాదు చనిపోయిన తేదీని కూడా అటు ఫ్లెక్సీలో ఏర్పాటు చేయడం గమనార్హం. అయితే కూతురికి అప్పటికే పెళ్లయింది. భర్తకు బోన్ క్యాన్సర్ అని తెలియడంతో అతని వదిలేసి పుట్టింట్లో ఉంటుంది కూతురు. అయితే అదే సమయంలో ఒక వ్యక్తితో ఆమెకు  పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారి.. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో కోపంతో ఊగిపోయిన తండ్రి ఈ చివరికి ఇక కూతురుకి బతికుండగానే పెద్ద కర్మ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: