సూసైడ్ చేసుకున్న యువకుడు.. కారణం తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు?

praveen
నేటి ఆధునిక జీవన శైలిలో మనిషి జీవితంలో ఎన్నో రకాల మార్పులు వస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోతున్న మనిషి.  ఇక తన అలవాట్లను కూడా మార్చుకుంటూ ఉన్నాడు. అంతా బాగానే ఉంది కానీ ఎందుకో నేటి ఆధునిక యుగంలో అటు మనిషికిలో విచక్షణ జ్ఞానం మాత్రం రోజురోజుకీ పూర్తిగా తగ్గిపోతుందేమో అనే భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎంతోమంది జనాలు.



 అయితే ఎంత పెద్ద సమస్య వచ్చినా ఆత్మహత్య చేసుకోవడం అనేది మహాపాపం. కానీ ఇటీవల కాలంలో జనాలు మాత్రం చిన్న చిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి  ఇలా క్షణికావేషంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా చివరికి కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు ఎంతోమంది. సమస్య ఏదైనా సరే ధైర్యంగా ఎదిరించి పోరాడి నిలబడాలి అన్న తత్వాన్ని పూర్తిగా మరిచిపోయి విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇటీవలే మధ్యప్రదేశ్లో కూడా  ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి.


 మధ్యప్రదేశ్లో ఒక వ్యక్తి హోటల్ నడుపుతున్నాడు. అయితే ఉన్నట్టుండి అతను రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయాడు. అయితే 2016లో ఆ వ్యక్తి స్వీయ రక్షణ కోసం లైసెన్సుడు రివాల్వర్ తీసుకున్నాడు. అయితే పోలీసులకు దీనికి సంబంధించి సమాచారం అందడంతో  అక్కడికి వచ్చి రక్తపు మడుగులో ఉన్న అతని వద్ద నుంచి ఏడు పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ సూసైడ్ నోట్లో అతను రాసింది చూసే ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. నేను 8, 9 ఏళ్ల ముందే 30ఏళ్ల వరకే బతకాలనుకున్నాను. ఇప్పుడు నాకు 30 వచ్చేసాయి. అందుకే చనిపోతున్నాను. నాకు ఎలాంటి కష్టాలు బాధలు లేవు. నా చావుకు ఎవరు కారణం కాదు అంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: