ప్యాకెట్ లో ఒక బిస్కెట్ మిస్.. కంపెనీకి భారీ జరిమానా?
చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఈ మ్యారీ గోల్డ్ బిస్కెట్లు తినడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక ఈ మ్యారిగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్లు వివిధ ధరల్లో కూడా అందుబాటులో ఉంటాయి అని చెప్పాలి. అయితే ఎప్పుడైనా మేరీ గోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ కొన్నప్పుడు అందులో ఎన్ని బిస్కెట్లు ఉంటాయి అందరికి తెలిసే ఉంటుంది. ఇక ఎప్పుడైనా ఒక బిస్కెట్ తక్కువగా వచ్చిందంటే పొరపాటు జరిగిందేమో అని అందరూ చూసిచూడనట్టు ఉండిపోతారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం బిస్కెట్ ప్యాకెట్ లో ఒక బిస్కెట్ తక్కువగా వచ్చిందని ఏకంగా వినియోగదారుల ఫోరం కోర్టును ఆశ్రయించాడు.
ఇలా ఒక్క బిస్కెట్ మిస్ కావడం ఒక పెద్ద ఇష్యూ గా మారిపోయింది అని చెప్పాలి. చెన్నైకి చెందిన ఢిల్లీ బాబు అనే వ్యక్తి తాను కొన్న సన్ ఫిస్ట్ మేరీ లైట్ బిస్కెట్ ప్యాకెట్ లో 16 బిస్కెట్లకు గాను 15 ఉన్నట్లు గుర్తించి 2021 లో వినియోగదారుల ఫోరం ను ఆశ్రయించాడు. లక్షల బిస్కెట్ ప్యాకెట్లు ఉత్పత్తి చేసే కంపెనీ ఒక బిస్కెట్ తగ్గించి మోసం చేస్తుంది అంటూ పేర్కొన్నాడు. అయితే దీనిపై ఐటిసి కంపెనీ వివరణతో కోర్టు సంతృప్తి చెందలేదు. ఇది నిబంధనలకు విరుద్ధమే అని భావించింది. ఈ క్రమంలోనే సదరూ కంపెనీకి లక్ష జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.