నీ భార్య చనిపోయిందంటూ ఫోన్.. ఆ తర్వాత అసలు ట్విస్ట్ బయటపడింది?

praveen
అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడు. పెద్దలకు ప్రేమ విషయం చెబితే ఒప్పుకోలేదు. అమ్మాయి ఇంట్లోను ఇదే పరిస్థితి. ఇంకేముంది పెద్దలను ఎదిరించి నాకు అమ్మాయే ముఖ్యమని పెళ్లి చేసుకున్నాడు. ఇలా పెళ్లి చేసుకున్నవాడు అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి.. తల్లిదండ్రులకు దూరంగా వచ్చిన ఆమెను ఇక ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా కాచుకోవాలి. నిజమే అలాగే చూసుకున్నాడు. ఇక  వారి జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కానీ అంతలో ఒక అనూహ్ ఘటన. స్నేహితుల నుంచి యువకుడికి ఫోన్ వచ్చింది. అతడి భార్య చనిపోయిందని అత్తింటి వారు  అంత్యక్రియలు చేస్తున్నారని ఫోన్ లో స్నేహితుడు చెప్పాడు.


 ఇక ఎంతో బాధతో ఇంటికి వెళ్లిన అతని జీవితం తలకిందులు అయిపోయింది. అదంతా అత్తింటి వారు పన్నిన కుట్ర అన్న విషయం తెలిసింది. ఈ ఘటన హర్యానాలో వెలుగులోకి వచ్చింది. ఝాజ్జర్ జిల్లాలోని సూర్యేటి గ్రామానికి చెందిన అంజలి, సందీప్ ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి మరి వీరు ఒకటయ్యారు. సెక్టర్ 102 లోని ఒక అద్దె ఫ్లాట్లో కాపురం పెట్టారు. అయితే అంజలి పై కోపం పెంచుకున్న ఆమె తల్లిదండ్రులు తమ్ముడు ఎలాగైనా హత్య చేయాలని స్కెచ్ వేశారు.


 అంజలి తమ్ముడు కునాల్ అతడి భార్యను తీసుకొని కొన్ని రోజుల క్రితం అంజలి ఇంటికి వచ్చారు. అక్కడే నాలుగు రోజులు ఉన్నారు. ఇక అత్తింటి వారితో సంబంధం మెరుగుపడుతుందని సందీప్ సంతోషపడ్డాడు. ఈ క్రమంలోనే ఏదో పని నిమిత్తం సందీప్ తన సోదరి ఇంటికి వెళ్ళాడు. కునాల్ భార్య ఆఫీస్ కి  వెళ్ళింది. అయితే కూనల్ తల్లిదండ్రులతో అంజలిని చంపి మృతదేహాన్ని సొంతూరుకు తీసుకువెళ్లి అంత్యక్రియలు  పూర్తి చేశారు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న సందీప్ నిర్గాంత పోయాడు. తన ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే ఫ్లాట్కు తాళం వేసి ఉంది. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. అంజలి సోదరుడే హత్య చేశాడంటూ కేసు పెట్టాడు. రంగంలోకి దిగిన పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని కునాల్ ఒప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: