ఆనందంగా డాన్స్ చేసింది.. కానీ అంతలోనే గుండెపోటు.. చివరికి?

praveen
అసలేం జరుగుతుంది.. ఎందుకు ఇలా మనుషుల ప్రాణాలు పోతున్నాయి.. దీనికి అసలు కారణం.. పరిష్కారం లేదా.. ఇలా అయితే ఎలా.. మనిషి జీవితం ఇంతేనా.. ప్రస్తుతం ప్రతి ఒక్కరి మనసులో ఇలాంటి  ఆందోళనలు పెరిగి పోతున్నాయి అని చెప్పాలి. దీనికి కారణం ఇటీవల కాలం లో మనుషుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతూ ఉన్నాయి. చూస్తూ చూస్తుండ గానే ఎంతో మంది కుప్ప కూలిపోయి ప్రాణాలు వదులుతున్నారు. కేవలం సెకండ్ల వ్యవధిలో గాల్లో ప్రాణాలు కలిసి పోతున్నాయ్. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రతి ఒక్కరూ ప్రాణభయం తోనే బ్రతికేస్తూ ఉన్నారు.


 చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా అటు సడన్ హార్ట్ ఎటాకుల బారిన పడుతూ చివరికి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. అయితే ఇలా సడన్ హార్ట్ ఎటాక్ లు ఎందుకు వస్తున్నాయి అన్నదానికి ఇప్పటికీ ఒక కారణమే లేకుండా పోయింది. కానీ ఎప్పుడు లేని విధంగా సడన్ హార్ట్ ఎటాక్ల కారణంగా ప్రాణాలు పోతున్న సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో ఇలా హార్ట్ ఎటాక్ల బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలియక.. ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ దినదిన కండంగానే బ్రతుకుతున్నారు అందరూ.


 ఇలా సడన్ హార్ట్ ఎటాక్ కారణంగా మరో ప్రాణం గాల్లో కలిసిపోయింది. కరీంనగర్ లోని గంగాధర ఆదర్శ పాఠశాలలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫ్రెషర్స్ డే వేడుకల్లో డాన్స్ చేస్తూ ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ప్రదీప్తి చివరికి గుండెపోటుతో కుప్పకూలింది. అయితే వెంటనే ఉపాధ్యాయులు అప్రమత్తమై ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే చనిపోయింది. ఆమె స్వస్థలం గంగాధర మండలం వెంకటాయపల్లి అని తెలుస్తోంది. కాగా ఈ ఫ్రెషర్స్ డే వేడుకల్లో సదరు విద్యార్థిని అరగంట పాటు ఆగకుండా నృత్యం చేసినట్లు మిగతా విద్యార్థులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: