ఆటిజం అనేది చాపక్రింద నీరులా చిన్నారుల భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తూ వారి తల్లి దండ్రులను, కుటుంబాలను తీరని వేదనకు గురిచేస్తున్న మందేలేని సెన్సోరియల్ సమస్య, ఇటువంటి పిల్లలకు ఉన్న ఒకే ఒక మార్గం ధెరపీ సర్వీసులు.
హైదరా బాద్ మహా నగరం లో ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహించ బడుతున్నటు వంటి కొన్ని ఆటిజం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ మరియు రిహాబిలిటేషన్ సెంటర్ల పై Kukatpally,Suchitra BK guda dilsukhnagar ప్రాంతాల లో గత రెండు మూడు రోజులుగా అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం ఆలస్యం గా వెలుగు లోకి వచ్చింది, చిన్న పిల్లలలో సెన్సోరియల్ సమస్యలు, ఎదుగుదల లోపాలు మరియు మానసిక రుగ్మతలకు సంబంధిచినటు వంటి ఇబ్బందులకు శాస్త్రీయ పద్దతి లో మాత్రమే థెరపిస్ ఇవాల్సిఉంటుంది. ఈ విషయాల పై చాలా మంది నిపుణులు అనేక మార్లు హెచ్చరించడం తెలిసిన విషయమే,
Sec - 52 RPWD Act 2016, ప్రకారం సెంటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని మరియు వాటికీ అనుగుణం గా మాత్రమే ఇటువంటి థెరపిస్ ఇవాల్సి ఉంటుందని అధికార్లుకూడా స్పష్టం చేశారు. వీటి మీద సరయిన అవగాహన లేకుండా థెరపిస్ అనే పేరుతో చిన్న పిల్లల భవిష్యత్తు పైన విపరీతమైన ప్రభావం చూపిస్తుందని తెలిసిన తల్లి తండ్రులు ఆందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి నకిలీ చైల్డ్ డెవలప్ సెంటర్స్.. రిహాబిలిలేషన్ సెంటర్ లపై చర్యలు తీసుకోవాలని చిన్నారుల తల్లీ దండ్రులు కోరుతున్నారు.
ఈ అక్రమ సెంటర్ లపై సరిఅయిన చర్యలు తీసుకోవాలి అని నిపుణలు, తల్లిదండ్రుల కోరికల మేరకు అధికారులు సోదాలు చేపట్టారని సమాచారం. ఈ క్రమం లోనే అక్రమం గా నిర్వహిస్తున్నట్లు తెలితే ఆయా సెంటర్ల పై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.