బయట పడుకున్న మహిళ.. ముఖంపై నుంచి వెళ్లిన కారు.. షాకింగ్ వీడియో?
ఒక మహిళ తన బిడ్డతో కలిసి ఒక దుకాణం ముందు హాయిగా నిద్రిస్తుంది. అయితే ఒక్కసారిగా వేగంగా వచ్చిన కారు మహిళపై నుంచి వెళ్ళింది. వెంటనే డ్రైవర్ కారు ఆపి కిందికి దిగాడు. ఆ మహిళకు ఏమైనా జరిగిందేమో చూసాడు. ఇదంతా వీడియోలో రికార్డు అయ్యింది. కారు ముందు చక్రం మహిళ పై నుంచి వెళ్ళగానే కారుని ఆపి చూసాడు. అయితే మహిళ పక్కనే ఉన్న చిన్నారిపై కారు వెళ్లకపోవడంతో అక్కడ పెను ప్రమాదం తప్పింది. అయితే మహిళ పై నుంచి కారు వెళ్లిన ఆ మహిళ అదృష్టంతో ప్రమాదం ఏమి జరగలేదు. లక్కీగా ప్రాణాలతో బటయ పడిందనే చెప్పాలి. ఈ వీడియోని @crazyclipsonly అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. షేర్ అయిన ఈ వీడియో కొన్ని సెకెన్లలోనే రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ వీడియోకు 15 మిలియన్ వ్యూస్ వచాయి. 80 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే ముందు ఆ మహిళది కూడా తప్పు ఉందని, అసలు బిడ్డతో కలిసి రోడ్డు మీద పడుకోవడం ఏంటని, ఇలా ఉంటె ప్రమాదాలు జరగవా అని కామెంట్లు పెడుతున్నారు. అయినా ఆ డ్రైవర్ అంత వేగంగా నడపడం ఏంటి, కళ్ళ మునుఁడు మనుషులు కనపడలేదా అంటూ ఫైర్ అవుతున్నారు.