వైరల్: కాలేజీలో అందరూ చూస్తుండగానే.. లవర్స్ ఏం చేసారో చూడండి?
"ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు... కలల ఖనిజాలతో చేసిన యువత" అని గుంటూరు శేషేంద్ర శర్మ ఏ ముహూర్తాన చెప్పారో గానీ, ఆయనే గానీ ఇపుడు బతికుంటే ఆ మాటలు రాసినందుకు సిగ్గుపడేవారు. అవును, దానికి కారణం నేటి యువత బాధ్యతారాహిత్యం అని వేరే ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు. నేటి భారత యువకులు కామం మత్తులో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. వీధుల్లోనే కాకుండా దేవాలయంలా పవిత్రంగా భావించే కాలేజీలో కూడా వారి బరితెగింపు ఎక్కువైపోయింది. బుద్ధిగా చదువుకొని దేశానికి సేవ చేయాల్సిన వారు పాడు పనులు చేస్తూ సభ్యసమాజాన్ని బ్రష్టుపట్టిస్తున్నారు.
ఎక్కడ ఉన్నాం? ఏం చేస్తున్నాం? అనే స్పృహ లేకుండానే కామంతో రగిలిపోతూ ముద్దుల్లో మునిగి తేలుతున్నారు. పబ్లిక్ గానే రొమాన్స్ చేసుకున్న జంటల గురించి మనం అనేకసార్లు విన్నాం. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇద్దరు లవర్స్ రెచ్చిపోయి మరీ ప్రవర్తించడం సమాజానికి సిగ్గు చేటు. వైరల్ అవుతున్న వీడియోకి బట్టి షాజహాన్ పూర్ లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అని అర్ధం అవుతోంది. ఓ హాల్ లో కొందరు విద్యార్థులు కూర్చుని ఉన్నారు. ఓ అమ్మాయి పక్కనే అబ్బాయి ఉన్నాడు. సడెన్ గా వాడికి మూడ్ వచ్చిందో ఏమో కానీ, అది కాలేజీ అన్న సంగతి కూడా మర్చిపోయాడు. సరసానికి దిగాడు. అవును, అమ్మాయికి ముద్దులు పెట్టడం స్టార్ట్ చేశాడు.
ఈ క్రమంలో ఆ అమ్మాయి కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినప్పటికీ అతడు తగ్గేదేలే అంటూ రెచ్చిపోయాడు. ముద్దుల వర్షం కురిపించాడు. ఆ తర్వాత ఆమెపై చేతులు వేయడం కూడా ఇక్కడ చూడవచ్చు. అబ్బాయి చర్యతో అమ్మాయి కొంత ఇబ్బంది పడినప్పటికీ ఆ అబ్బాయిని నిలువరించే ప్రయత్నం మాత్రం చేయలేదు. అమ్మాయికి అబ్బాయి ముద్దులు పెడుతుండగా అక్కడే ఉన్న మరో విద్యార్థి వీడియో తీశాడు. అంతే, ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దాంతో ఒక్కసారిగా కాలేజీలో దుమారం రేగింది. కాలేజీ గదిలో ఇదేం పాడుపని అంతా మండిపడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు వారికి ఓ రేంజులో యేసుకుంటున్నారు. బుద్ధిగా చదువుకోవాల్సిన విద్యార్థులు ఇలా ముద్దుల్లో మునిగి తేలడం ఏంటని? సీరియస్ అవుతున్నారు.