భార్యను చంపిన భర్త.. అతనేం హంతకుడు కాదు అన్న కోర్టు?

praveen
ఇటీవల కాలంలో దాంపత్య బంధంలో అన్యోన్యత కాదు.. క్రూరత్వమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భర్తను భార్య చంపడం లేదా ఏకంగా భార్యను భర్త అత్యంత కిరాతకంగా హత్య చేయడం లాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. అందరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. అయితే ఇలా కట్టుకున్న వారిని హత్య చేసిన వారికి అటు కోర్టులు కఠినమైన శిక్షలు విధిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మాత్రం ఏకంగా భార్యను చంపిన కేసులో భర్తను  నిర్దోషిగా తెలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఘటన లండన్ లోని సిప్రెస్స్ లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.



 అయితే బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న భార్య జానీ హంటర్ బాధను తట్టుకోలేక తానే ప్రాణాలు తీయమని కోరిందని.. తప్పని పరిస్థితుల్లో ఇక  ఆమెను హత్య చేసి అతను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడని హంతకుడు తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే అతని వాదనలతో ఏకీభవించింది కోర్టు. 76 ఏళ్ళ డేవిస్ హంటర్ భార్య జానీ హంటర్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడింది. చూస్తుండగానే వ్యాధి ముదిరిపోయింది. చివరి రోజుల్లో ఆమె నొప్పి భరించలేక తీవ్ర వేదన అనుభవించింది. బ్రతికుండడం కంటే చనిపోవడమే బెటర్ అని ఎప్పుడు భర్తకు చెబుతూ ఉండేది.నన్ను చంపి ఈ నొప్పి నుంచి విముక్తి కలిగించు అంటూ భార్య భర్తను కోరింది. భార్య వేదనను  చూడలేకపోయిన భర్త వేరే దారి లేక భార్యను చంపేశాడు.


 ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరికి అతన్ని కోర్టులో హాజరు పరిచారు. అయితే భార్యను చంపడానికి వెనుక కారణం ఏంటి అన్న విషయాన్ని పదే పదే కోర్టుకు విన్నవించాడు సదరు వ్యక్తి. తన భార్యకు చివరి రోజుల్లో అన్ని దగ్గరను చూసుకున్నానని.. చివరికి డైపర్లు కూడా మార్చేవాడిని.. తనకోసం నేను అంతగా కష్టపడటం చూడలేక పోయిన భార్య తన ప్రాణాలు తీయాలని వేడుకుంది. తప్పని పరిస్థితులు అలా చేశానని చెప్పుకొచ్చాడు. ఇక వాదోపవాదాలు విన్న తర్వాత కోర్ట్ డెవిస్ హంటర్ నరహంతకుడేమి కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక జూలై 27న హంటర్ నిర్దోషి అని తీర్పు రావటమే తరువాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: