అయ్య బాబోయ్.. ఆర్టీసీ బస్సులో టికెట్ ధర రూ.29,210?
ఇక తెలంగాణలో అయితే ఆర్టీసీ చైర్మన్గా సజ్జనర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అటు ప్రయాణికులకు నాణ్యమైన సర్వీసులు అందించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు అన్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రయాణిస్తూ స్వయంగా బస్సుల్లోని ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు సజ్జనర్. అంతేకాదు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఇక టికెట్ ధరలను కూడా సవరిస్తూ వస్తున్నారని చెప్పాలి. అయితే ఇక్కడ ఏకంగా తెలంగాణ ఆర్టీసీ సిటీ బస్సులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా ఆర్టీసీ బస్సులో టికెట్ ధర ఎంతవరకు ఉంటుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఎంత దూరమైనా సరే మహా అయితే 100 లేదా 150 వరకు ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా టికెట్ ధర 29,210 ఉంది. ఇలా సిటీ బస్సులో టికెట్ ధర చూసి ప్రయాణికుడు ఆశ్చర్యపోయాడు. రాణిగంజ్ డిపోకు చెందిన బస్సులో కండక్టర్ ఇచ్చిన టికెట్ ధర అక్షరాల 29,210 గా ఉంది. ఇది చూసి ప్రయాణికుడి నోట మాట రాలేదు. అయితే ఇది గమనించిన కండక్టర్ మిషన్లో టెక్నికల్ సమస్యతో తప్పుగా వచ్చిందని.. ఇక ప్రయాణికుడికి మరో టికెట్ ఇచ్చాడు. అయితే ఈ టికెట్ ఫోటో తీసుకున్న ప్రయాణికుడు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది.