నగ్న వీడియోలు.. చివరికి తలకిందులైనా యువకుడి జీవితం?

praveen
ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్ళ ఆగడాలకు సంబంధించిన వార్తలు తరచూ ఏదో ఒకటి తెర మీదకి వస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు జనాలను బురిడీ కొట్టించడానికి ఒక్కొకరు ఒక్కొక్క స్టైల్ లో నేరాలకు పాల్పడుతున్నారు. ఏకంగా బ్యాంకు ప్రతినిధుల లాగా ఫోన్ చేసి ఓటీపీలు తెలుసుకొని బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే వారు కొంతమంది అయితే.. ఇక నకిలీ ప్రొడక్ట్స్ పేరుతో బురిడీ కొట్టించే వారు ఇంకొంతమంది.. ఇక మరి కొంతమంది ఆన్లైన్ ద్వారా అమ్మాయిల పేరుతో ఎరవేసి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు గుంజే వారు ఇంకొంతమంది అని చెప్పాలి. అయితే ఇలా సైబర్ నేరగాళ్ల  బారిన పడుతూ ఇక పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలంటూ ఎంతో మంది కోరుతున్నారు. ఇలాంటి వార్తలు చదువుతున్న జనాలలో మాత్రం అవగాహన పెరిగిపోవట్లేదు.


 అయితే ఇలా జనాలను బురిడీ కొట్టించడానికి ప్రయత్నిస్తున్న సైబర్ నేరగాళ్ళ విషయంలో కొన్ని కొన్ని సార్లు విధి వక్రంచి సీన్ రివర్స్ అయ్యి చివరికి అరెస్ట్ అయ్యే పరిస్థితులను కొనితెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఒక యువకుడు విషయంలో ఇలాంటిదే జరిగింది. న్యూడ్ వీడియో కాల్స్ తీసి యువతిని బెదిరించాలి అనుకున్నాడు యువకుడు. కానీ చివరికి దొరికిపోయాడు. డిప్లమో పూర్తయింది జల్సాలు చేయాలనుకున్నాడు. ఇక ఇంస్టాగ్రామ్ వంటి సామాజికమధ్యమంలో యువతులను పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో నగ్న అసభ్య వీడియోలు చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడటం మొదలుపెట్టాడు.


 ఇలా ఇప్పుడు వరకు ఎంతో మంది యువతుల దగ్గర లక్షల్లో నగదు కాజేశాడు. ఇటీవల ఏలూరు జిల్లా మదనపల్లిలో ఒక గ్రామానికి చెందిన యువతి హైదరాబాదులో ఎంబీఏ చదువుతుంది. అయితే ఇటీవల ఆ యువకుడు  చేయి కోసుకుంటానని బెదిరించి వీడియోలు ఫోటోలు పెట్టమన్నాడు.ఇక ఆమె భయపడి పెట్టగా ఆ వాటిని ఆధారంగా చేసుకుని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో పోలీసులను ఆశ్రయించింది. అయితే ఇటీవల సింగరాయపాలెం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. అయితే సదరు వ్యక్తి మన్యం జిల్లా జియమ్మవలస మండలం బీట్రూడు పల్లికి చెందిన మిర్యాల నవీన్ గా  తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: