భర్త అక్రమ సంబంధం పెట్టుకుంటే.. చివరికి భార్య ప్రాణం పోయింది?
ఇక ఇలాంటి తరహా ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి. ఏకంగా కట్టుకున్న వారిని కాదని పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి ఎంతో మంది పచ్చటి కాపురంలో చేజేతులారా చిచ్చు పెట్టుకుంటున్నారు. అంతేకాదు ఏకంగా కట్టుకున్న వారికి కష్టసుఖాల్లో తోడునీడగా ఉండాల్సింది పోయి యమకింకరులుగా మారిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే అక్రమ సంబంధాల కారణంగా పోతున్న ప్రాణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న.. మనుషుల పేరులో మాత్రం మార్పు రావడం లేదు. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. అక్రమ సంబంధం మాయలో పడిపోవడం కారణంగా మరో ప్రాణం గాల్లో కలిసిపోయింది.
హైదరాబాద్ నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జడ్చర్ల మండలం గొల్లపల్లి వాసి 22 ఏళ్ల కవితకు అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌కు 8 నెలల క్రితం పెళ్లి జరిగింది. అయితే పెళ్లి సమయంలో పది లక్షల కట్నం 15 బంగారం కూడా ఇచ్చారు. అయితే భార్యతో కలిసి చంద్రశేఖర్ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ లో ఉంటున్నాడు. అయితే కాటేదాన్‌లో కాపురం పెట్టాడు. ఇక పెళ్లి కాకముందు చంద్రశేఖర్‌కు మరో యువతితో అక్రమ సంబంధం ఉండగా.. పెళ్లయిన తర్వాత కూడా ఆ సంబంధాన్ని కొనసాగించాడు. అయితే ఈ అక్రమ సంబంధం గురించి భార్యకు తెలియడంతో చివరికి అదనపు కట్నం కావాలంటూ భార్యను వేధించడం మొదలు పెట్టాడు. చివరికి భార్య సూసైడ్ చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.