మూడోసారి ఆడబిడ్డె పుట్టిందని.. ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా?

praveen
తండ్రి అంటే పైకి గంభీరంగా కనిపించిన ఎప్పుడు పిల్లలపై అమితమైన ప్రేమను చూపిస్తూ ఉంటాడు. ఇక పిల్లలకు ఏ కష్టం వచ్చినా అసలు తట్టుకోలేడు. ఇక ఎంత కష్టమైనా సరే పిల్లలకు సంతోషంగా చూసుకోవాలని ఆశ పడుతూ ఉంటాడు ప్రతి తండ్రి.  కానీ ఇక్కడ ఒక తండ్రి మాత్రం అలా చేయలేదు. ఏకంగా రక్తం పంచుకొని పుట్టిన చిన్నారి విషయంలో దారుణంగా ప్రవర్తించాడు. ఏకంగా సొంత కూతురిని అంగట్లో ఆట బొమ్మగా మార్చేశాడు. మూడోసారి కూడా కూతురు పుట్టింది అని కోపంతో చివరికి ముక్కుపచ్చలారని శిశువును అమ్మేందుకు ప్రయత్నించాడు ఇక్కడ ఒక నీచమైన తండ్రి. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో వెలుగులోకి వచ్చింది.

 గుల్లకోట గ్రామంలో మంగళవారం వెలుగు చూసింది అని చెప్పాలి. జ్యోతి, లక్ష్మణ్ దంపతులకు మూడు నెలల కిందట మూడో సంతానంగా ఆడపిల్ల జన్మించింది. అయితే అప్పటికే ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టడంతో కోపంతో ఊగిపోయిన లక్ష్మణ్ దారుణంగా ప్రవర్తించాడు. కూతురుని అమ్మి డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో ఆర్గనైజర్ గా పని చేసే లక్ష్మణ్ తన మూడో కూతురిని విక్రయించేందుకు జమ్మికుంటకు చెందిన వ్యక్తితో రహస్య ఒప్పందం చేసుకున్నాడు. రోజు మాదిరిగానే జ్యోతి పిల్లలకు స్నానం చేయిస్తుండగా.. మూడో బిడ్డను లక్ష్మణ్ కార్ లో తీసుకెళ్ళాడు. గమనించిన పెద్ద కూతురు చెల్లిని ఎవరో తీసుకెళ్లారని తల్లికి చెప్పింది. దీంతో జ్యోతి బయటికి వచ్చి కార్ ను వెంబడించే ప్రయత్నం చేయగా.. కారు వేగంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత జ్యోతి తల్లిదండ్రులు పోలీసులకు విషయం తెలుపడంతో తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు చివరికి చిన్నారిని తల్లి చెంతకు  చేర్చారు.

అయితే ఈ ఘటనపై కేసు నమోదు కాలేదు అన్న విషయం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: