భార్య ముక్కు కోసిన భర్త.. కారణం ఏంటో తెలుసా?
అయితే ఇలా విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్న పర్వాలేదు. కానీ కొంతమంది మాత్రం ఏకంగా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పాలి. కట్టుకున్నవారు ఏకంగా బద్ధ శత్రువులు అన్న విధంగా వ్యవహరిస్తూ దారుణంగా దాడికి పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇక వెలుగులోకి వచ్చే ఇలాంటి ఘటనలను చూసిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఇంతటి దారుణమైన పరిస్థితులను చూడాల్సి వస్తుందా అని ప్రతి యువతీ,యువకుడు కూడా భయపడుతున్నారు అని చెప్పాలి. ఉత్తరప్రదేశ్లోని లకిమ్ పుర్ లో అయితే ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
భార్యకు తెలియకుండా భర్త మరో మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన భార్య భర్తను నిలదీసింది. అయితే ఇలా నిలదీయడమే ఆమె పాలిట శాపంగా మారిపోయింది. ఏకంగా నిలదీసిన భార్య ముక్కు కోసి పారిపోయాడు భర్త. బన్ స్థలి లో ఈ ఘటన చోటుచేసుకుంది. విక్రమ్ అనే వ్యక్తికి సీమాదేవి అనే మహిళతో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే విక్రమ్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరగడంతో.. కోపంలో భార్య ముక్కు కోసేసి పారిపోయాడు భర్త. ఇక బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.