ఇలా అయితే.. దేశవాళీ క్రికెట్ ఆడి లాభమేంటి : అభినవ్
ఒకప్పుడు దేశవాళి టోర్నీలలో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ఇక భారత జట్టులోకి ఎంపిక చేసేవారు సెలక్టర్లు. కానీ ఇప్పుడు టీమిండియా సెలక్షన్ విషయంలో పద్ధతి పూర్తిగా మారిపోయింది. దేశవాళి క్రికెట్లో ఎంత మంచి ప్రదర్శన చేసిన సెలెక్టర్లు పట్టించుకోవట్లేదు. ఇక బిసిసిఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మంచి ఫామ్ కనబరిచిన ప్లేయర్లు ఎంతో వేగంగా టీమ్ ఇండియాలోకి రాగలుగుతున్నారు. ఇక ఇప్పుడు వెస్టిండీస్ పర్యటన కోసం సెలెక్టర్లు ఎంపిక చేసిన జట్టు విషయంలో కూడా ఇలాంటి పద్ధతినే పాటించారు. 2023 ఐపీఎల్ లో రాణించిన ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ కి జట్టులో అవకాశం కల్పించారు.
కానీ ఐపీఎల్ లో ఛాన్స్ దొరకపోయినప్పటికీ దేశవాళి క్రికెట్లో రాణిస్తున్న కొంతమంది ప్లేయర్స్ కు మాత్రం ఇక వెస్టిండీస్ పర్యటనలో చోటు దక్కలేదు. ఇక ఇదే విషయం గురించి యంగ్ క్రికెటర్ అభినవ్ ముకుంద్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. వెస్టిండీస్ పర్యటనకు సెలక్షన్ విధానం తనకు అస్సలు అర్థం కాలేదు అంటూ వ్యాఖ్యానించారు. తన రాష్ట్రం కోసం దేశవాళి క్రికెట్ ఆడిన ప్లేయర్లకు వచ్చే లాభం ఏమిటి.. ఐపీఎల్ ఆడిన ప్లేయర్ లే ఎంతో వేగంగా భారత జట్టులోకి వస్తున్నారు అంటూ యంగ్ క్రికెటర్ అభినవ్ ముకుంద్ టీమ్ ఇండియా సెలక్షన్ కమిటీని ప్రశ్నించాడు.