అమ్మాయి నుంచి మెసేజ్.. టెంప్ట్ అయినా 79 ఏళ్ళ వృద్ధుడు.. చివరికి?

praveen
సాధారణంగా 79 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఎవరైనా సరే కృష్ణా రామ అనుకుంటూ మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటూ వృద్ధాప్యాన్ని ఎంతో సంతోషంగా గడిపేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక 79 ఏళ్ల వృద్ధుడు మాత్రం చింత చచ్చిన పులుపు చావలేదు అన్న విధంగా వ్యవహరించాడు. ఏకంగా తన ఫోన్ కి అమ్మాయి నుంచి మెసేజ్ రావడంతో ఒక్కసారిగా కమిట్ అయిపోయాడు. ఇక న్యూడ్ వీడియో కాల్ చేస్తాను అంటూ అమ్మాయి అడగడంతో ఇక తనకు అదృష్టం వరించింది అంటూ లోలోపల ఎంతగానో ఉప్పొంగిపోయాడు. కానీ కట్ చేస్తే అతనికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. దీంతో కాపాడండి మహాప్రభు అంటూ చివరికి పోలీస్ స్టేషన్కు పరుగులు పెట్టాడు.

 ఈ ఘటన ఎక్కడో కాదు హైదరాబాద్ నగరంలోనే వెలుగులోకి వచ్చింది. 79 ఏళ్ల వ్యక్తికి ఇటీవలే వాట్సాప్ లో ఒక అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చింది. అమ్మాయి నుంచి మెసేజ్ రావడంతో  వెనుక ముందు ఏమీ ఆలోచించలేదు. ఎవరు ఏంటి అన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. చివరికి అమ్మాయితో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో సదరు వృద్ధుడిని మాటల్లో దించిన అమ్మాయి న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుకుందాం అంటూ ముగ్గులోకి దింపింది.  ఇప్పుడు తాను బయట ఉన్నానని కాసేపటి తర్వాత వీడియో కాల్ చేస్తానని బాత్రూం నుంచి మాట్లాడుతాను అంటూ చెప్పింది.

 79 ఏళ్ల వయసులో ఇవన్నీ మనకెందుకు అనుకోకుండా ఆ వృద్ధుడు అమ్మాయితో వీడియో కాల్ కి సిద్ధమయ్యాడు. ఇక ఆమె చెప్పినట్లుగానే వీడియో కాల్ చేశాడు. కానీ ఇక్కడే అసలు కథ అడ్డం తిరిగింది. అతను నుంచి వచ్చిన వీడియో కాల్ స్క్రీన్ రికార్డు చేశారు. తర్వాత కొంతమంది వ్యక్తులు వృద్ధుడికి కాల్ చేసి సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఫ్యామిలీ మెంబర్స్ కి పంపించి అభాసుపాలు చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. చివరికి ఇలా భయపెట్టి 15 లక్షలు వసూలు చేశారు. ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో.. చివరికి 79 ఏళ్ల మృతుడు కాపాడండి అంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.  కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: