పుట్టిన వెంటనే పిల్లల్ని చంపి.. ఫ్రిడ్జ్ లో పెట్టిన తల్లి.. ఎందుకో తెలుసా?
ఎందుకంటే కడుపున పుట్టిన పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవడం మానేసి ఏకంగా దారుణంగా హతమారుస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. కడుపున పుట్టిన పిల్లలను చంపడం మొదలుపెట్టింది తల్లి. చంపడమే కాదు ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టింది. రోజులు నెలలు కాదు కొన్నేళ్లపాటు ఫ్రిడ్జ్ లో ఉంచింది. ఈ ఘటన దక్షిణ కొరియాలో వెలుగు చూసింది. రంగంలోకి దిగిన పోలీసులు చివరికి ఆమెను అరెస్టు చేశారు. సువాన్ నగరానికి చెందిన మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఇక ఆ ముగ్గురి వయసు 8 నుంచి 12 ఏళ్ల మధ్య ఉంటుంది. అయితే వీరు కాకుండా 2018లో ఆమెకు ఒక పాప జన్మించింది. అయితే మరుసటిరోజే ఆ బిడ్డను చంపి ఇంట్లోనే ఫ్రిడ్జ్లో పెట్టింది మహిళా. ఇక 2019లో మరో పాప పుట్టుగా ఇదే విధంగా దారుణానికి పాల్పడింది. ఆస్పత్రిలో డెలివరీ అయినట్లు రికార్డులు ఉన్న పుట్టిన పిల్లలు పేర్లు మాత్రం ఎక్కడా నమోదు కాలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు ఇటీవల ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు దర్యాప్తుకు తొలుత ఆ మహిళ సహకరించలేదు. కానీ ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో ఫ్రిజ్ లో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. అయితే పిల్లల్ని పోషించే ఆర్థిక స్థితి లేకపోవడంతోనే ఇలా ప్రాణాలు తీసినట్లు సదురు మహిళలు ఒప్పుకుంది.