క్రికెట్ ఆడాడు.. చివరికి ప్రాణం పోయింది?
అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త సద్దుమనిగాయ్ కరోనా వైరస్ ప్రభావం తగ్గింది అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయం లో వినూత్నమైన రీతిలో ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. మునుపెన్నడూ లేని విధం గా ఏకంగా సడన్ హార్ట్ ఎటాక్లతో ఎంతో మంది చూస్తూ చూస్తుండగానే కుప్ప కూలిపోయి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చాలానే వెలుగు లోకి వస్తున్నాయ్. ఇక ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ప్రతి ఒక్కరిలో కూడా ప్రాణభయాన్ని కలిగిస్తూ ఉన్నాయి అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు.
అయితే ఆరోగ్యంగా ఉన్నవారు ఆరోగ్యంగా లేనివారు అని తేడా లేకుండా.. ప్రతి ఒక్కరు కూడా సడన్ హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. చూస్తూ చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. ఏం జరిగిందో అనే ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలతో ప్రతి ఒక్కరు కూడా భయాందోళనలో మునిగిపోతున్నారు. ఇటీవల ఏపీలోని వైజాగ్ లో కూడా ఇలాంటి తరహా ఘటనే వెలుగు చూసింది. క్రికెట్ ఆడుతూ అప్పటివరకు ఎంతో చురుకుగా కనిపించిన మణికంఠ అనే న్యాయవాది ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక పరీక్షించిన వైద్యులు ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు వడదెబ్బతో పాటు సడన్ హార్ట్ ఎటాక్ కారణంగా న్యాయవాది మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.