మద్యం మత్తులో స్నానానికి వెళ్తే.. చివరికి ప్రాణం పోయింది?

praveen
ఇటీవల కాలంలో మనిషికి మరణం ఎలా సంభవిస్తుందో అన్నది ఊహకందని విధంగానే మారిపోయింది.  ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అటు విధి చిన్నచూపు చూసి చివరికి ప్రాణాలు తీసేస్తుంది. మరి ఇంకోనిసార్లు ప్రాణాంతకమైన వైరస్ లు దూసుకొచ్చి మనిషి ప్రాణాలను తీసేస్తున్నాయి. ఇక సడన్ హార్ట్ ఎటాకుల కారణంగా పోతున్న ప్రాణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి.


 మనుషులు ఏకంగా నిర్లక్ష్యంగా చేస్తున్న పనులతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న ఘటనలు కూడా చాలానే వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి స్నానం చేయాలి అని అనుకున్నాడు. చివరికి అతని ఆలోచన  ప్రాణం పోయే పరిస్థితిని తీసుకువచ్చింది.. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు లో జరిగింది. పటేల్ గూడా గ్రామ పరిధిలో శివారులోని ఊబకుంట చెరువులో స్నానానికి దిగి ఒక యువకుడు మృతి చెందిన ఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.



 వివరాల్లోకి వెళితే.. అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే 23 ఏళ్ల యువకుడు స్విగ్గి జొమాటోలో డెలివరీ బాయ్గా పనిచేస్తూ ఉండేవాడు. అయితే చంద్రశేఖర్ మద్యానికి బానిసై రోజు మద్యం సేవిస్తూ ఉండేవాడు. ఇక ఇటీవల పటేల్ కూడా గ్రామ శివారులో ఫుల్లుగా మొత్తం తాగాడు. ఇక ఆ తర్వాత స్నానం చేయాలని చెరువులోకి దిగి.. ఇక నీటమునిగి మృతి చెందాడు. ఉదయం ఇక చెరువులో చంద్రశేఖర్ మృతదేహం బయటపడింది. చెరువు గట్టున అతడి వస్తువులు కూడా ఉన్నాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో స్నానానికి వెళ్లి మృతి చెంది ఉండవచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: