సుఖపెట్టడు.. విడాకులు ఇవ్వడు.. కేసు పెట్టిన భార్య?

praveen
సాధనంగా భార్యాభర్తల బంధం అనేది అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి . ఒక్కసారి దాంపత్య బంధం లోకి అడుగుపెట్టిన తర్వాత కష్టసుఖాలలో ఒకరికి ఒకరు తోడు నీడగా ఉండాలి. ఇక ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకుని గౌరవిస్తూ ఉండాలి. అయితే భార్యాభర్తల బంధంలో మానసిక అన్యోన్యత ఎంత ముఖ్యమో.. శారీరక అన్యోన్యత కూడా అంతే ముఖ్యం అన్న విషయం తెలిసిందే. శారీరక బంధం బలంగా ఉన్నప్పుడే దాంపత్య బంధంలో గొడవలు తక్కువగా వస్తాయని అటు నిపుణులు కూడా చెబుతూ ఉంటారు.

 ఈ క్రమంలోనే భార్యాభర్తలు ఎప్పుడూ కూడా అటు శారీరక బంధం విషయంలో జాగ్రత్త వహించాలని సూచిస్తూ ఉంటారు నిపుణులు. అయితే ఇక్కడ ఒక మహిళ మాత్రం ఏకంగా శారీరక సంబంధం విషయంలో నిరాశ చెందింది. ఏకంగా భర్త పైనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. తన భర్త తనను సుఖపెట్టట్లేదని కనీసం దగ్గరికి కూడా రావట్లేదని ఫిర్యాదులో పేర్కొంది సదరు భార్య. విడాకులు ఇప్పించాలి అంటూ కోరింది. ఈ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇక భార్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసి అటు పోలీసులు కూడా షాక్ అయ్యారు.

 మాండ్యా జిల్లాకు చెందిన ఒక వివాహిత తన భర్త హసన్ ఏడాదికాలంగా దగ్గరికి రావడం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు ఏడాది క్రితమే పెళ్లి జరిగింది. భర్తతో ప్రేమగా మాట్లాడిన ఎంతో చిరాకు పడుతున్నాడు. ఇక ఇద్దరి మధ్య శృంగార జీవితం కూడా ఆశించినంత లేదు అంటూ మహిళా తెలిపింది. ఇక ఏడాది కాలం నుంచి తన దగ్గరికి రావట్లేదు.. అలా అని విడాకులు తీసుకుందామని చెబితే అందుకు ఒప్పుకోవట్లేదు.. తనకు న్యాయం చేయాలి అంటూ ఇక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇక వీరిద్దరిని కూడా పోలీసులు కోర్టులో హాజరుపరచబోతున్నారు అని చెప్పాలి. దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: