సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతూ.. కుప్పకూలిన బాలిక.. చివరికి?

praveen
ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో సెల్ఫోన్ అనేది ఒక భాగంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం మనిషి అవసరాలను తీర్చడానికి.. మనుషుల మధ్య కమ్యూనికేషన్ ను పెంచడానికి వచ్చిన సెల్ఫోన్ ఇక ఇప్పుడు ఏకంగా ఆరడుగుల మనిషినే బానిసగా మార్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే నిజమే అందరూ అనుకున్నట్లుగానే సెల్ఫోన్ మనుషుల మధ్య కమ్యూనికేషన్ పెంచింది. అయితే సెల్ఫోన్లో ఎక్కడో ఉన్న మనుషులతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న మనిషి.. అటు పక్కనే ఉన్నవారిని పలకరించడమే మానేశారు .

 ఇలా మనుషుల మధ్య కమ్యూనికేషన్ పెంచుతూనే.. దూరాన్ని కూడా పెంచేస్తూ ఉంది సెల్ఫోన్. అయితే ఇటీవల కాలంలో ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి ఇక సెల్ఫోన్లోనే గంటల తరబడి కాలం గడుపుతున్న వారు ఎక్కువగానే కనిపిస్తున్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా అటు  అందరూ ఆన్లైన్ క్లాసుల ద్వారా చదువు  కొనసాగించిన నేపథ్యం లో సెల్ఫోన్ చేతి లో కనిపిస్తే ఒకప్పుడు మందలించిన తల్లిదండ్రులే.. సెల్ఫోన్ పిల్లల చేతికి ఇచ్చేసారు. దీంతో ఇక చిన్న పిల్లలు కూడా ఇప్పుడు సెల్ ఫోన్ కి బానిసలుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పాలి.

 అయితే ఈ సెల్ఫోన్ కారణంగా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.  చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతూ ఉండడంతో విద్యుత్ షాక్ తో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. యూపీలో ఇలాంటి తరహా ఘటన జరిగింది. సెల్ఫోన్ చార్జింగ్ పెడుతున్న సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో శరీరం తీవ్రంగా కాలిపోయి.. 12 ఏళ్ల బాలిక మరణించినట్లు పోలీసులు తెలిపారు. బలియా ప్రాంతంలోని సైదుపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. మాన్సి అనే బాలిక సెల్ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఇక శరీరం కాలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: