వర్కౌట్ చేసి.. వాష్ రూమ్ వెళ్ళాడు.. అక్కడే ప్రాణం పోయింది?

praveen
రేపు బాగుంటుంది అనే చిన్న ఆశతోనే మనిషి జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఆ రేపు ఉంటుందో లేదో అనే భయం మాత్రం నేటి రోజుల్లో ప్రతి ఒక్కరిలో కలుగుతుంది   దీనికంతటికీ కారణం నేటి రోజుల్లో సంభవిస్తున్న మరణాలే. మొన్నటి వరకు కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతికారు. ఏ క్షణంలో ప్రాణం పోతుందో అని ప్రతిక్షణం వనికి పోయారు. కానీ ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం తగ్గింది. దీంతో ఇప్పుడిప్పుడే స్వేచ్ఛగా బయటతిరిగేందుకు ధైర్యం చేస్తున్నారు.

 హమ్మయ్య ఒక పెద్ద ముప్పు నుంచి తప్పించుకున్నాం అని ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అటు సడన్ హార్ట్ ఎటాక్ లు మాత్రం ప్రతి ఒక్కరిలో ప్రాణం భయాన్ని కలిగిస్తున్నాయి. రేపు అనేది ఉంటుందా అనే అనుమానాన్ని ప్రతి ఒక్కరిలో కూడా కలిగేలా చేస్తూ ఉన్నాయి. ఎంతోమంది సడన్ హార్ట్ ఎటాక్ల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పటివరకు ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నవారు. క్షణాల వ్యవధిలోనే కుప్పకూలిపోయి ప్రాణాలు వదులుతున్నారు. ఇక్కడ ఇలాంటి మరణమే మరొకటి సంభవించింది.

 మాజీ మిస్టర్ ఇండియా, బాడీ బిల్డర్ ప్రేమ్ రాజ్ అరోరా (42) ఇటీవల సడెన్ హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోయాడు. సాధారణంగా ప్రతిరోజు వ్యాయామం చేస్తే కాస్త ఎక్కువ కాలం బ్రతికే ఛాన్స్ ఉంటుందని డాక్టర్లు చెబుతూ ఉంటారు. ఇక బాడీ బిల్డర్ అన్న తర్వాత వ్యాయామం అనేది వారి రోజువారి జీవితంలో ఒక భాగం అవుతూ ఉంటుంది. అయితే ఇటీవల ఇంట్లో వర్కౌట్ చేసి వాష్ రూమ్ కి వెళ్ళాడు ఆయన.కానీ ఎంతకీ బయటికి రాలేదు. కుటుంబ సభ్యులు పిలిచిన సమాధానం లేకపోవడంతో అనుమానం వచ్చి బాత్రూం డోర్ బద్దలు కొట్టి చూసారు. ఇక ప్రేమ్ రాజ్ లోపల అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. గుండెపోటుతో అతను చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన రాజస్థాన్లోని కోటాలో జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: