విధి ఆడిన నాటకం.. రేపే కూతురు పెళ్లి.. అంతలోనే తండ్రి?

praveen
విధి ఆడిన వింత నాటకంలో మనుషుల జీవితాలు కేవలం కీలుబొమ్మలాంటివి మాత్రమే అనేది నిజమే అని నిరూపించే ఘటనలు ఇటీవల కాలంలో ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్నా సమయంలో ఊహించని ఘటనలు చివరికి ప్రాణాలను తీసేస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. తల్లి కడుపులో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే లేదంటే వృద్ధాప్యం వస్తేనో మరణం సంభవిస్తుందని అందరూ అనుకునేవారు. కానీ ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన ఘటనలు చూసిన తర్వాత మరణం ఎప్పుడు ఏ క్షణంలో ఏ వయసులో సంభవిస్తుంది అన్నది కూడా ఊహకందని విధంగానే  మారిపోయింది.



 వైద్యులు చెప్పినట్లు ప్రతిరోజు వ్యాయామం చేస్తున్న... పౌష్టికాహారాన్ని తీసుకుంటున్న.. చెడు అలవాట్లకు దూరంగా ఉన్నా ఎక్కువ కాలం బ్రతుకుతామన్న గ్యారెంటీ మాత్రం లేకుండా పోయింది. అయితే ఇక అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చే ఘటనలు చూస్తే మాత్రం.. విధి మనుషుల జీవితాలతో మరీ ఇంత దారుణంగా ఆడుకుంటుందా అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇటీవల సిద్దిపేట జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. కూతురుని అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ తండ్రి ఇక కూతురికి పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టడానికి సిద్ధమయ్యాడు.



ఈ క్రమంలోనే పెళ్లి సంబంధం చూసి పెళ్లిని నిశ్చయించారు. అయితే రేపే కూతురు పెళ్లి జరగాల్సి ఉంది. కానీ ఇంతలో విధి వారి కుటుంబంలో ఉన్న ఆనందాన్ని చూసి ఓర్వలేకపోయింది. దీంతో రేపు కూతురు పెళ్లి ఉంది అనగా.. అంతలోనే తండ్రి ప్రాణం పోయే పరిస్థితిని తీసుకువచ్చింది. బస్వాపూర్ ముత్తన్నపేటలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. రేపు కూతురు వివాహం ఉండగా తండ్రి ఐలయ్య ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమార్తె పెళ్లికి డబ్బులు సమకూరలేదని మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: