చనిపోయిన తండ్రి శవాన్ని.. ఫ్రిజ్లో పెట్టాడు.. ఎందుకో తెలుసా?

praveen
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటు లోకి వచ్చేసింది . ఈ క్రమం లోనే ఈ సోషల్ మీడియా లో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా కూడా కేవలం నిమిషాల వ్యవధి లోనే తెలుసుకోగలుగుతున్నాడు మనిషి. ఇక అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తో ప్రపంచాన్ని మొత్తం చుట్టేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమం లోనే సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే కొన్ని కొన్ని ఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.


 సాధారణంగా ప్రియమైన వారు దూరమైనప్పుడు వాళ్లు ఇక లేరు అన్న విషయాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఎంత అరణ్య రోదనగా విలపించిన కూడా ప్రాణాలు పోయిన వారు మళ్ళీ తిరిగి రాలేరు. ఇక ఇలా దూరమైన వారి జ్ఞాపకాలలోనే బ్రతికున్నవారు బాధపడుతూ ఇక జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక యువకుడు మాత్రం తండ్రి చనిపోయిన విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. తండ్రి లేకుండా జీవితం ఎలా గడపాలో కూడా అతనికి అర్థం కాలేదు. దీంతో ఒక షాకింగ్ ఆలోచన చేశాడు. ఏకంగా 18 నెలలపాటు తండ్రి మృతదేహాన్ని ఫ్రిడ్జ్ లోనే ఉంచాడు కొడుకు.



 ఈ షాకింగ్ ఘటన నెదర్లాండ్ లో వెలుగులోకి వచ్చింది. తండ్రి చనిపోయిన విషయాన్ని ఎవరికి తెలియకుండా.. ఫ్రిడ్జ్ ఉంచిన విషయం తెలిసి పోలీసులు సైతం షాక్ అయ్యారు. అయితే చనిపోయిన తండ్రి వయసు 101 ఏళ్ళు కాగా కొడుకు వయసు 82 ఏళ్లు కావడం గమనార్హం. ఇ న్ని రోజులపాటు తండ్రి మృతదేహాన్ని ఎందుకు ఫ్రిజ్లో పెట్టావని పోలీసులు ప్రశ్నిస్తే.. తండ్రితో మాట్లాడకుండా ఉండలేనని.. మిస్ అవుతానని భయం వేసిందని.. అందుకే ఫ్రిజ్లో ఉంచి తన తండ్రిని రోజు చూసుకుంటున్నాను అంటూ అతను షాకింగ్ ఆన్సర్ చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: