
తల్లితో సహజీవనం.. కూతురుపై కన్ను.. చివరికి?
ఇటీవలే మేడ్చల్ జిల్లా కండ్ల కోయలో కూడా ఇలాంటి ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఆ మహిళ కూతురుపై కన్నేసాడు. ఈ క్రమంలోనే మహిళపై లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ప్రయత్నించాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. బాలిక చేతికి అందిన కర్రతో కొట్టడంతో ఈ ఘటన జరిగింది. కండ్లు కోయ ప్రాంతంలో ఒరిస్సాకు చెందిన జయ శ్రీ నాయక్ అనే మహిళ నివాసం ఉంటుంది. గత కొంతకాలం నుంచి ఆమె పద్మనాభ నాయక్ అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తుంది.
కొన్ని వారాల క్రితమే జయ శ్రీ నాయక్ కూతురు కండ్లు కోయకు వచ్చి తల్లి వద్ద ఉంటుంది. అయితే ఇక మైనర్ బాలికను చూసిన పద్మనాభ నాయక్ బాలికపై కన్నేసాడు. ఎన్నోసార్లు బాలికతో చనువుగా మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఇక చేతులు వేసి అసభ్యంగా తాకేందుకు కూడా ప్రయత్నించాడు. అయితే తల్లి జై శ్రీ నాయక్ ఈ విషయం తెలిసి పద్మనాభ నాయక్ ను హెచ్చరించింది. కానీ అతని తీరు మారలేదు. ఇటీవల తల్లి డ్యూటీ కి వెళ్ళినప్పుడు కూతురు ఒక్కతే ఇంట్లో ఉండడంతో అత్యాచారం చేయబోయాడు పద్మనాభ నాయక్. ఆమె ప్రతిఘటించింది. ఇంట్లో ఉన్న కర్రతో దారుణంగా కొట్టింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు పద్మనాభ నాయక్. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.