71 ఏళ్ళ వయసులో.. వృద్ధుడికి అందమైన అమ్మాయిపై కోరిక.. చివరికి?

praveen
ఇటీవల కాలం లో సైబర్ నేరగాళ్ళు ఎంతలా రెచ్చి పోతున్నారో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. కాస్త సందు దొరికిందంటే చాలు ఖాతా మొత్తం ఖాళీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సైబర్  ఉచ్చులో పడకుండా ఉండేందుకు అటు సామాన్యులు ఎంతల ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది అని చెప్పాలి. ఎప్పటికప్పుడు సైబర్ నేరాలకు పాల్పడేందుకు  కొత్త మార్గాలని ఎంచుకుంటున్న కేటుగాళ్లు ఎంతో మంది జనాలను బురిడీ కొట్టిస్తున్న ఘటనలు ఇటీవల కాలం లో వెలుగు లోకి  వస్తున్నాయి.

 ఒకప్పుడు కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నాం అంటూ చెప్పి ఓటిపి తెలుసుకుని సైబర్ నేరానికి పాల్పడే వారు ఎంతో మంది. కానీ ఇటీవల కాలం లో అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టుకుని.. యువకుల నుంచి వృద్ధుల వరకు వరకు అందరికీ డేటింగ్ ఆశ చూపి చివరికి ఖాతాలను ఖాళీ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. సైబర్ నేరుగాళ్ల ఉచ్చులో పడి పోయి ఎంతో మంది లక్షల పోగొట్టుకుంటున్నారు. కొంత మంది అయితే పరువు పోతుందని  పోలీసులను ఆశ్రయించకుండా ఉంటే... ఇంకొంతమంది మాత్రం న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది అని చెప్పాలి. ఒక వృద్ధుడు అందమైన యువతిపై మనసు పడి చివరికి 4.5 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు.. ముంబైలోని సమతా నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లో నివాసం ఉంటున్న 71 ఏళ్ళ  వృద్ధుడి మొబైల్ కి ఒక మెసేజ్ వచ్చింది. దీంతో ఆశపడిన సదరు వృద్ధుడు ఇక ఆ మొబైల్ నెంబర్ కి ఫోన్ చేశాడు. దీంతో ఒక అందమైన అమ్మాయి ఫోటో పంపించి పలు దపాలుగా అతని దగ్గర నుంచి 4.5 లక్షల రూపాయలను కాజేశాడు సైబర్ నేరగాళ్లు. దీంతో మోస పోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: