బాబోయ్ కుక్కలు.. మనుషులనే కాదు వాటిని వదలట్లేదు?
అప్పటివరకు బాగానే ఉంటున్న వీధి కుక్కలు ఉన్నట్టుండి ఏదో ఆవహించినట్లుగానే ఒక్కసారిగా దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో ఎంతోమంది జనాల ప్రాణాల మీదికి వస్తుంది అని చెప్పాలి. అయితే కేవలం మనుషుల మీదే కాదు అటు మూగజీవాలపై కూడా వీధి కుక్కలు దారుణంగా దాడికి దిగుతున్నాయి అన్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. ఇటీవల వికారాబాద్ జిల్లాలో కూడా ఇలాంటిదే జరిగింది. ఏకంగా వీధి కుక్కల దాడిలో కృష్ణ జింక మృతి చెందింది. దీంతో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు అని చెప్పాలి.
వికారాబాద్ జిల్లా పెదమూల్ మండలం హర్మాపూర్ గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో కృష్ణ జింకలను కుక్కలు వెంబడించాయి. ఇక వాటి భారీ నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తిన జింక పొలంలో ఫెన్సింగ్ వైర్ ను తగిలి తీవ్రంగా గాయపడింది. అయితే అప్పటికే తీవ్ర గాయాలతో లేవలేని స్థితిలో ఉన్న జింకపై కుక్కల గుంపు మూకుమ్మడిగా దాడి చేసి దారుణంగా ప్రాణాలు తీసేసాయి. ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక స్థానికులు ఇది గమనించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇక వైద్యుల సమక్షంలో జింకను పూడ్చివేశారు అని చెప్పాలి. కాగా మొన్నటికి మొన్న వనపర్తి జిల్లా పానగల్ మండలం జమ్మిపూరు గ్రామంలో కూడా ఏకంగా 48 గొర్రెలు ప్రాణాలు తీసాయ్ కుక్కలు. దీంతో కుక్కల నుంచి రక్షణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు ప్రజలు.