హెయిర్ కట్ నచ్చలేదని.. సూసైడ్ చేసుకున్నాడు.. ఎక్కడంటే?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషి ఆలోచన తీరు ఎటు పోతుందో అర్థం చేసుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. ఎందుకంటే ఒకప్పటితో పోల్చి చూస్తే నేటి రోజుల్లో అక్షరాస్యత పెరిగిపోయింది. అంతేకాదు మనిషి జీవనశైలిలో కూడా మార్పు వచ్చింది. ఇక మనిషి ఏ విషయం కోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. టెక్నాలజీని ఉపయోగించుకొని అన్ని పనులను కూడా ఎంతో సులభంగా చేసుకునేందుకు అవకాశం ఉంది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో మనిషి ఆలోచన తీరు మాత్రం టెక్నాలజీకి అనుగుణంగా ముందుకు కాదు వెనక్కి వెళ్ళిపోతుంది అన్నది అర్థమవుతుంది.

 ఎందుకంటే దేవుడు ఇచ్చిన విలువైన జీవితంలో ఏదో ఒకటి సాధించడం మానేసి.. చిన్న చిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు ఎంతోమంది. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ చివరికి నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగానే ముగిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఇంత చిన్న కారణానికి కూడా ప్రాణాలు తీసుకుంటారా అని ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ఇటీవల ముంబైలో ఇలాంటి ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది.

 ముంబైలో ఒక బాలుడు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం చివరికి తల్లిదండ్రులకుశోకాన్ని మిగిల్చింది అని చెప్పాలి. తానే జిల్లా భయాందోర్ నగరానికి చెందిన 13 ఏళ్ల బాలుడికి ఇటీవల తల్లిదండ్రులు హెయిర్ కట్ చేయించారు. అయితే జుట్టు చాలా చిన్నగా కట్ చేయడంపై ఆ బాలుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇదే విషయంపై తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. దీంతో తల్లిదండ్రులు అతన్ని మందలించారు. ఇక మనస్థాపం చెందిన బాలుడు అపార్ట్మెంట్ బిల్డింగ్ 16వ అంతస్తు నుంచి కిందకి దూకాడు. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అల్లారు  ముద్దుగా పెంచుకున్న కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మునిరయ్యారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: