కుమార్తె వివాహానికి అప్పు పుట్టలేదు.. తండ్రి ఏం చేశాడో తెలుసా?

praveen
కట్నం తీసుకోవడం అనేది చట్ట ప్రకారం నేరం అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఇలాంటిది ఎవరు పట్టించుకోవడం లేదు. కట్నం లేనిదే అసలు పెళ్లిల్లే జరగడం లేదు. ఇక నేటి రోజుల్లో భూముల ధరలు పెరిగిపోతున్నట్లుగానే ఏకంగా వరుడు కుటుంబ సభ్యులు తీసుకునే కట్న కానుకలు కూడా అంతకంతకుపెరిగిపోతూ ఉన్నాయి. ఇలా కట్న కానుకలు పెరిగిపోతూ ఉండడం మాత్రం అటు ఏకంగా వధువు తల్లిదండ్రులకు ఎంతో భారంగా మారిపోతున్నాయి. రెక్కాడితే గాని  డొక్కాడని కుటుంబంలో పుట్టిన వారు ఇక ఆడపిల్లల పెళ్లిళ్లు చేసేందుకు ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పాలి.

 ఇంకా ఎంతో మంది తల్లిదండ్రులకు ఆడపిల్ల భారంగానే కొనసాగుతుంది అన్నది మాత్రం నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న నిదర్శనంగా మారిపోతూ ఉన్నాయి. ఇక ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఆ దేవుడు కూడా గుడ్డివాడేమో అని అనిపిస్తూ ఉంటుంది.. ఎందుకంటే కాయ కష్టం చేసుకుని గౌరవంగా జీవించే వారికి ఇంకా కష్టపడుతూనే ఉంటాడు. మోసాలకు పాల్పడుతూ అందిన కాడికి దోచుకునే వారికి మాత్రం లగ్జరీ లైఫ్ని ఇస్తూ ఉంటాడు అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక తండ్రి కూతురు పెళ్లి చేయలేక చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

 సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దోమాటకు చెందిన 55దేళ్ల బక్కులుకి మిరుదొడ్డి  మండలం పెద్ద చెప్యాల శివారులో  ఎక్కడన్నర పొలం ఉంది. అయితే తన ఐదుగురు కుమార్తెల్లో నలుగురికి వివాహాలు చేశాడు. అయితే ఇక ఇప్పుడు ఐదో కుమార్తె కూడా పెళ్లీడుకు వచ్చింది. అయితే అప్పటికే వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోయాడు బక్కులు. దానికి తోడు ఇక కుమార్తెల పెళ్లిలకు చేసిన ఐదు లక్షల అప్పులు కూడా అలాగే ఉండిపోయాయి. ఇక అంతలోనే ఐదో కుమార్తె కూడా పెళ్లీడుకు వచ్చింది అని చెప్పాలి. దీంతో ఇక చివరి కుమార్తె పెళ్లి చేసేందుకు అప్పు ఎక్కడ పుట్టలేదు. దీంతో మనస్థాపం చెందిన  బక్కులు చివరికి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి  పాల్పడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: