పెళ్లికూతురుకు జుట్టు తక్కువ ఉందని.. వివాహం క్యాన్సిల్?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాతికేళ్ల ప్రాయంలో ఇక జీవితాంతం కలిసి ఉండే భాగస్వామిని ఎంచుకునేందుకు అవకాశం వస్తుంది  అయితే ఒకప్పుడు అయితే పెద్దలు చెప్పిన వారిని కాదు కూడదు అనకుండా పెళ్లి చేసుకునే వారు యువతి యువకులు. కానీ నేటి రోజుల్లో మాత్రం ఇక తమ వందేళ్ళ జీవితం ఎలా ఉండాలి అన్న విషయాన్ని తామే స్వయంగా నిర్ణయించుకుంటాం అని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక యువతి యువకులు తమకు కావలసిన భాగస్వామిని స్వయంగా వారే ఎంచుకుంటూ ఉన్నారు.

 అయితే ఒకప్పుడు వరుడు కుటుంబ సభ్యులు అటు వధువు ఇంటికి వెళ్లి పెళ్లి చూపులు చూసేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం పెళ్లిచూపులు అన్ని కూడా ఇక మ్యాట్రిమోనీ సైట్లలోనే జరుగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే వయసు చదువు ఉద్యోగం లాంటి అన్ని వివరాలను కూడా మ్యాట్రిమోనీ సైట్లలోనే చూస్తూ చివరికి నచ్చిన వారిని ఎంచుకుంటూ ఉన్నారు ఎంతోమంది యువతీ యువకులు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో కొన్ని పెళ్లిళ్లు పెళ్లి పీటల వరకు వచ్చి క్యాన్సల్ అవుతూ ఉన్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.

 చిన్నచిన్న కారణాలకే కొన్ని పెళ్లిళ్లు క్యాన్సల్ అవుతూ ఉండడం గురించి తెలిసి ఎంతో మంది ముక్కున వేలేసుకుంటున్నారు అని చెప్పాలి  అయోధ్యలోని బీకాపూర్ లో కూడా ఇలాగే జరిగింది. వధువు నెత్తిపై జుట్టు సరిగ్గా లేదని ఆమెను పెళ్లి చేసుకోను అంటూ పెళ్లికి ఒక్కరోజు ముందు తెగేసి చెప్పాడు వరుడు. అయితే దీంతో కంగు తిన్న  కుటుంబ సభ్యులు బంధువులు ఓ రాత్రంతా నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన వరుడు మాత్రం మొండి పట్టు వీడలేదు. ఇక ఈ విషయాన్ని ముందే తెలిపామని చెప్పిన వధువు కుటుంబ సభ్యులు చివరికి పోలీసులను ఆశ్రయించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అదనపు కట్నం కోసమే పెళ్లికి నిరాకరించాడు అంటూ ఫిర్యాదు చేశారు వధువు కుటుంబ సభ్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: