
కాసేపట్లో అంత్యక్రియలు.. అంతలో షాక్ ఇచ్చిన కాటికాపరి?
అయితే అక్కడ ఉన్న కాటికాపరి అందరిలాగానే శవానికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు డబ్బులు డిమాండ్ చేశాడు. ఏకంగా 5000 ఇవ్వాలి అంటూ కోరాడు. కానీ అంత పెద్ద మొత్తంలో ఇచ్చుకోలేము అంటూ అటు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పాపం అని దహన సంస్కారాలు నిర్వహించడం మానేసి.. ఏకంగా మృతదేహానికి దహన సంస్కారాల నిర్వహించేందుకు పేర్చిన చితిపై పడుకున్నాడు కాటి కాపరి. ఈ ఘటనతో అక్కడ ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. గాంధారి మండలం నేరల్ తండాలో చోటుచేసుకుంది ఈ ఘటన.
దీప్ చంద్ అనే వ్యక్తి కొద్దిరోజులుగా అనారోగ్యం బాగా లేక చివరికి గుండెకి ఆపరేషన్ చేయించుకున్నాడు. కానీ ఆరోగ్యం విషమించడంతో చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే ఇక నేరల్ తండాలో అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. ఇక చితి వద్దకు చేరుకున్న తర్వాత కాటి కాపరి ఏకంగా చేతి పై పడుకొని 5000 ఇస్తేనే లేస్తానని పట్టుబట్టాడు. ఎంత బ్రతిమిలాడినా అతను లేచేందుకు మాత్రం నిరాకరించాడు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు చివరికి 2000 రూపాయలు ఇచ్చి ఇక దహన సంస్కారాలు చేశారు అని చెప్పాలి. అయితే చనిపోయి పుట్టడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను ఇలా డబ్బుల కోసం వేధించడం సరైనది కాదు అంటూ అక్కడున్న వారందరూ కూడా చర్చించుకున్నారు.