క్రికెట్ ఆడుతూ.. బాల్ కోసం వెళ్ళిన బాలుడు.. చివరికి?

praveen
మనిషి జీవితం అనేది వందేళ్లు బ్రతుకుతాం అనే ఆశతో నిండిన గ్యారెంటీ లేని లైఫ్. తల్లి కడుపు నుంచి బయటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వందేళ్లపాటు బ్రతికేస్తామని బాల్యం యవ్వనం వృద్ధాప్యం అన్ని చూస్తామని అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడూ ఎవరిని మృత్యువు కబలిస్తుంది అన్నది కూడా ఊహకుందని విధంగానే ఉంటుంది. సాధారణంగా అయితే ఏదో ఒక వ్యాధిని బారిన పడటం లేదా వృద్ధాప్యంలో వయసు మీద పడి చనిపోవడం లాంటివే అందరి విషయంలో జరుగుతాయని అనుకుంటారు.

 కానీ అభం శుభం తెలియని చిన్నారుల విషయంలో కూడా కొన్ని కొన్ని సార్లు మృత్యువు పగబట్టినట్లుగాని వ్యవహరిస్తుంటుంది అన్నది వెలుగులోకి వచ్చే ఘటనలు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లల్ని దూరం చేసి తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు సరదాగా గడుపుతున్న సమయంలో చిన్నారులు చేసే పొరపాట్లు చివరికి ప్రాణాలను తీసేస్తూ ఉంటాయ్. ఇక్కడకు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి విషాదకరమైనది అని చెప్పాలి.

 క్రికెట్ ఆడుతున్న 11 ఏళ్ల చిన్నారి ఎంతో సరదాగా గడుపుతున్నాడు. అలాంటి సమయంలోనే మృత్యువు అతని కోసం కాచుకొని వేచి చూసి మరి చివరికి కాటు వేసి ప్రాణాలను తీసేసింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. విద్యానగర్ కాలనీకి చెందిన ఈశ్వర్ అనే పదకొండేళ్ల బాలుడు స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. అయితే బ్యాటింగ్ చేస్తుండగా పక్కింట్లో పడ్డ బాల్ తీసుకురావడానికి వెళ్ళాడు. అక్కడే  చూస్తుంది అని మాత్రం కనుక్కోలేకపోయాడు. తోటలో కోతుల బెడత ఎక్కువగా ఉండడంతో రక్షణ కోసం విద్యుత్ తీగలను అమర్చారు. అయితే అది గమనించని బాలుడు ఆ విద్యుత్ తీగలకు తగిలి అక్కడికక్కడే విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: