భార్యపై కోపం.. భర్త ఏం చేశాడో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో మనిషి ప్రాణాలకు అసలు విలువ లేకుండా పోతుంది అన్నది నేటి రోజుల్లో వెలుగు లోకి వస్తున్న ఘటనలు చూస్తే అర్థమవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకి ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్న ఘటనలు తరచూ వెలుగు లోకి వస్తూ ఉన్నాయి. నేటి జనరేషన్లో ఎంతో మంది పెద్దపెద్ద చదువులు చదువుతూ ఇక జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉన్నప్పటికీ ఎందుకొ చిన్న చిన్న సమస్యలకే భయపడి పోతూ అక్కడితో జీవితం ముగిసి పోయింది అని భావిస్తూ చివరికి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

 దేవుడు ఇచ్చిన విలువైన ప్రాణాన్ని నిండు నూరేళ్ల పాటు బ్రతకకుండా అర్ధాంతరం గా చేజేతులారా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు కోకోళ్ళలుగా వెలుగు లోకి వస్తూ ఉన్నాయి. స్కూలుకు వెళుతున్న చిన్నారుల దగ్గర నుంచి కాటికి కాలు చాపిన ముసలి వాళ్ళ వరకు చిన్న చిన్న సమస్యలకే భయపడి పోతూ ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పాలి. ఇలా క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో మంది కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు అని చెప్పాలి.
 ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలే ఎంతోమంది ప్రాణాలను తీసేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. భార్యపై కోపంతో ఏకంగా సూసైడ్ చేసుకొని కుటుంబానికి క్షోభ మిగిల్చాడు ఇక్కడ ఒక వ్యక్తి. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఈ ఘటన వెలుగు చూసింది. హనుమంతు, జ్యోతి భార్య భర్తలు. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త పై అలిగి ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో మనస్థాపం చెందిన హనుమంతు ఉరివేసుకొని చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సదురు వ్యక్తి చనిపోవడానికి ముందుప్రాణాలు పోవడానికి భార్య బావమరిది కారణం అంటూ సూసైడ్ నోట్ కూడా రాసి పెట్టడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: