ఎంతకీ పెళ్లి కావట్లేదని.. యువకులు వినూత్న నిరసన?
ఎంతోమంది యువకులు కట్న కానుకల కోసమే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇక అర్థం చేసుకునే యువతీ దొరికితే చాలు అనుకునేవారు ఎక్కడో నూటికో కోటికో ఒక్కరు మాత్రమే కనిపిస్తున్నారు. అదే సమయంలో యువతులు కూడా మంచి ఉద్యోగం చేసి బాగా సెటిల్ అయినవాడు భర్తగా దొరికితే బాగుంటుంది అని ఎంతగానో ఆశపడుతున్నారు అని చెప్పాలి. అయితే ఇలా ఉన్నతమైన చదువులు చదివి బాగా సెటిల్ అయిన వారికి పెళ్లి సంబంధం ఎంతో ఈజీగా కుదిరేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం మంచి ఉద్యోగంలో ఉన్న కూడా పెళ్లి కావడం లేదు ఆ యువకులకు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా నిరాశ తప్పడం లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల పెళ్లి కావడం లేదు అన్న కారణంతో ఇటీవల యువకులందరూ కూడా వినూత్నమైన నిరసన చేపట్టారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో వెలుగు చూసింది. పెళ్లి కాని యువకులు వింత నిరసన హాట్ టాపిక్ గా మారిపోయింది. రాష్ట్రంలో తగిన సంఖ్యలో అమ్మాయిలు లేరని ఆవేదన వ్యక్తం చేశారు యువకులు. ఈ క్రమంలోనే గుర్రాలపై ఊరేగింపుగా వచ్చి సోలాపూర్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. చదువుకుని ఉన్నతమైన ఉద్యోగంలో కొనసాగుతున్నప్పటికీ తమకు పెళ్లిళ్లు కావడం లేదని.. ఇక లింగ నిష్పత్తిలో వ్యత్యాసాలు ఉండడానికి అటు అధికారలే కారణం అంటూ ఆరోపిస్తున్నారు యువకులు.