కొడుకు కావాలని కోరిక.. ముగ్గురు మగ పిల్లలు పుట్టిన.. ఆందోళన?

praveen
నేటి రోజుల్లో ఆడపిల్ల పుడితే భారంగా భావించడం పురిట్లోనే ఆడపిల్లను చెత్తకుప్పలో పడేయడం లేదా దారుణంగా చంపేయడం లాంటి ఘటనలు చాలా తక్కువగానే వెలుగులోకి వస్తున్నాయి. ఆడపిల్ల పుట్టిన మగపిల్లాడి పుట్టిన ఎంతో ఆనందంగానే స్వీకరిస్తున్నారు తల్లిదండ్రులు. కానీ కొంతమంది అయితే నేటి రోజుల్లో కూడా మగపిల్లాడు పుడితే బాగుండు అని కోరుకుంటున్నా వారు కూడా లేకపోలేదు అని చెప్పాలి. ఇక్కడ దంపతులు కూడా చాలామంది లాగే అనుకున్నారు. కొడుకు పుడితే బాగుండు అని కోరుకున్నారు. వారికి అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. మగపిల్లాడు పుట్టాలని కోరికతో మరోసారి గర్భం దాల్చింది మహిళ. ఇక అనుకున్నట్లుగానే మగపిల్లాలు పుట్టారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు ఒకే కాన్పులో జన్మించారు. కానీ ఆ తల్లిదండ్రులు ఆందోళనలో మునిగిపోయారు. మగపిల్లాడు పుట్టిన తర్వాత బాధెందుకు అనుకుంటున్నారు కదా. అక్కడే అసలు సమస్య మొదలైంది. రాజస్థాన్ లోని బంగార్పూర్ జిల్లా సగ్వాడ ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది.

 స్థానికంగా ఉండే బడు, జయంత్ లాల్ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు.. కొడుకు కావాలని ఆశపడి మరోసారి గర్భం దాల్చింది మహిళ. ఓకే కాన్పులో ముగ్గురు జన్మించారు. ఇక ముగ్గురు పిల్లలు నెలలు నిండకుండా జన్మించడం గమనార్హం. దీంతో డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్నారు. బిడ్డల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో 25 రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి తల్లిని పిల్లలను డిశ్చార్జ్ చేశారు. అయితే అక్కడే అసలు సమస్య మొదలైంది. ముగ్గురు ఆడపిల్లల తర్వాత కష్టపడి కన్న మగ పిల్లలను పోషించడానికి జయంత్ లాల్ ఎన్నో పాట్లు పడుతున్నాడు. అతని సంపాదన అంతంత మాత్రమే. పెరిగిన ఖర్చులతో సంసారం నడపడమే కష్టమైనా నేపథ్యంలో ముగ్గురు కొడుకులు సంబంధించిన ఆలనా పాలన చూసుకోవడం ఇక మందులు తీసుకురావడం.. ఎంతో కష్టంగా మారిపోయింది. ఇక విషయం తెలిసి అందుకే పెద్దలు అంటారు మంది ఎక్కువైతే మజ్జిక పల్చనా అవుతుంది అని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: