అలా చేసిందని.. భార్యను కొట్టి చంపిన భర్త?

praveen
సాధారణంగా భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు మారుపేరుగా చెబుతూ ఉంటారు అందరూ. కానీ ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తూ ఉన్న ఘటనలు చూస్తూ ఉంటే మాత్రం ఇక భార్యాభర్తల బంధం అంటే ఏకంగా ఉన్మాదానికి కేరాఫ్ అడ్రస్ ఏమో అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడు నీడగా ఉండాల్సిన భార్యాభర్తలు.. కట్టుకున్న వారి పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్న తీరు అందర్నీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంది అని చెప్పాలి.


 కట్టుకున్న వారి విషయంలోనే కాల యముడిగా మారిపోయి చిన్న చిన్న కారణాలకే దారుణంగా ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు ఎంతోమంది. ఇలా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే పెళ్లి చేసుకుంటే ఇంతటి దారుణ పరిస్థితులు ఉంటాయా అని ప్రతి ఒక్కరు కూడా పెళ్లి అనే ఆలోచననే విరమించుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ఇక ఇటీవల సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలంలో కూడా ఇలాంటి ఓ దారుణ హత్యకు సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా కష్టం వచ్చినప్పుడు భార్యకు అండగా నిలబడాల్సిన భర్త చివరికి ఆ భార్య విషయంలో కాల యముడిగా మారిపోయాడు.


 జైలు నుండి ఇంటికి తిరిగి వచ్చిన భార్య ను ఇంట్లోకి రానివ్వలేదు. అయినప్పటికీ ఆమె మాత్రం వినకుండా ఇంట్లోకి వెళ్లడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త చివరికి దారుణంగా భార్యను చంపేశాడు. మీనాజీపేట గ్రామంలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. రేణుక అనే 30 ఏళ్ల మహిళను భర్త హరికృష్ణ హత్య చేశాడు. చోరీ కేసులో రేణుక జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్ పై బయటికి వచ్చింది. దీంతో రేణుక ఇంట్లోకి రాకుండా కుటుంబ సభ్యులు తాళం వేశారు. అయినప్పటికీ వాకిట్లోనే మూడు రోజులు గడిపిన రేణుక ఇటీవలే  ఇంట్లోకి వెళ్ళింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త హరికృష్ణ కర్రతో దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది మహిళా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: