
పక్కింటి కుర్రాడే కదా అని ఇంట్లోకి రాణిస్తే.. చివరికి?
ఇక నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు ఆడపిల్ల తల్లిదండ్రులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. ఏకంగా పరాయి వ్యక్తులు మాత్రమే కాదు సొంతవాళ్లు సైతం ఆడపిల్లలపై అత్యాచారానికి పాల్పడుతున్న ఘటనలు చూస్తూ ఉంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఇక ఇటీవలే హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన జరిగింది. ఏకంగా బాలికపై అత్యాచారం చేశాడు యువకుడు.
ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని ఓ కాలనీలో 17 ఏళ్ల బాలిక కుటుంబం తో కలిసి ఉంటుంది. అయితే వాళ్ల పక్క ఇంట్లో ఉంటున్న ఓ యువకుడు ఆ బాలికకు మాయ మాటలు చెప్పి గత కొంతకాలం నుంచి కూడా లైంగిక వాంఛలు తీర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే అతడి వ్యవహారం పై అనుమానం వచ్చిన బాలిక తల్లి ఏం జరుగుతుందో అని గమనించడం మొదలు పెట్టింది. దీంతో ఓరోజు అతని నిర్వాకం బయట పడింది. దీంతో షాక్ అయిన బాలిక తల్లి వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.