కర్ణాటక మహిళ మర్డర్ మిస్టరీ వీడినట్టేనా... డబ్బే హత్యకు కారణమా?
కాగా ఆమె తరచూ బి కొత్తకోట లోని తన కూతురు భవానీ దగ్గరకు రావడం వెళ్ళడం చేస్తూ ఉండేదట. అయితే ఎప్పటిలాగే ఇంటికి వచ్చిన హేమలత...చెప్పకుండా ఇంటి నుండి బయటకు వెళ్లి ఎంతకీ రాకపోవడంతో భయపడిన ఈమె కూతురు భవానీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలా విచారణ స్టార్ట్ చేసిన పోలీసులు ఎట్టకేలకు కేసును చేధించారు. హేమవతి కి తన కూతురు ఊరిలో శ్రీకాంత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధం గా మారి ఒకరికి ఒకరులా మారిపోయారు. అదే చనువుతో హేమవతి అప్పుడప్పుడు తన దగ్గర ఉన్న డబ్బును అతని వద్ద దాచమని ఇచ్చిందట.
అలా కొంత మొత్తం అతని వద్ద పొదుపు చేసుకుంది.. అయితే ఒకరోజు డబ్బులు అవసరం అని అడిగిందట..కానీ శ్రీకాంత్ కు డబ్బు మోజుతో ఇవ్వడానికి నిరాకరించి..ఎలాగైనా కాజేయ్యాలని ప్లాన్ మనసులో అనుకున్నాడు. అందుకే ఆమెను డబ్బులు ఇస్తాను రమ్మని చెప్పి వచ్చాక చంపేసి బి కొత్తకోట అడవిలో పూడ్చి పెట్టాడట. అయితే ఈ డబ్బులు విషయం మాత్రం పోలీసులకు తన కుమారుడు చెప్పాడట. ఆ తర్వాత శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకుని విచారించగానే అన్ని నిజాలు బయటపడ్డాయి. డబ్బు కోసం మహిళను హత్య చేసిన పాపానికి కటకటాల పాలయ్యాడు శ్రీకాంత్...దీనితో వారి కుటుంబం సైతం వీధిన పడింది.. అందుకే ఏదైనా ఒక పని చేసే ముందు విచక్షణతో ఆలోచించాలి.