వార్నీ.. పోలీసుల సాయం కోరిన దొంగ?
మీరు ఎంత ప్రయత్నించినా... మేం దొరకము అంటూ దొంగతనాలు చేసిన చోటే కొన్ని లేఖలు వదిలి వెళ్ళిపోతున్న ఘటనలు కూడా ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయ్ అని చెప్పాలి. అంతేకాకుండా ఏ చిన్న క్లూ కూడా వదలకుండా పోలీసులకు తలనొప్పి తెచ్చి పెడుతున్నారు దొంగలు. ఇక్కడ ఒక దొంగ మాత్రం మరింత విచిత్రమైన పని చేశాడు. ఏకంగా చోరీ చేసిన తర్వాత పోలీసుల నుంచి తప్పించుకోవడం కాదు పారిపోయేందుకు పోలీసుల సహాయం అడిగాడు. ఇక దొంగ చేసిన పని కాస్త ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తుంది అని చెప్పాలి.
బంగ్లాదేశ్ లోని డోకాలో ఓ దొంగ కిరాణా దుకాణంలో చోరీ చేయడానికి వెళ్ళాడు. అయితే ఇక రాత్రి లోపలికి వెళ్ళిన దొంగ అంతా సర్దుకుని వచ్చేసరికి తెల్లారింది.. ఈ క్రమంలోనే అప్పటికే అక్కడ జనాల సందడి కూడా పెరిగిపోయింది. లోపల దొంగ ఉన్నాడు అని గమనించి ఇక జనం బాగానే గుమ్మిగూడారు. దీంతో బయటకు వస్తే దాడి చేస్తారని భయపడిన దొంగ నేరుగా పోలీసుల సహాయం కోరాడు. తనను రక్షించాలని ఫోన్ చేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు .. అక్కడ గుమి గూడిన జనాలను పంపించి చివరికి షాప్ లోపల ఉన్న దొంగను అరెస్టు చేశారు.