స్నేహితుడే కదా అని ఇంట్లో పెట్టుకుంటే.. భార్యపై కన్ను.. చివరికి?
స్వార్థ ప్రయోజనాల కోసం స్నేహం అనే ముసుగు వేసుకొని చివరికి నీచాతి నీచమైన పనులు చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కష్టాలు వచ్చినప్పుడు నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ వెన్ను తట్టాల్సిన స్నేహితుడు చివరికి వెన్నుపోటు పొడుస్తూ దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఏకంగా స్నేహితుడి ఇంటి ఇంట్లో వారి విషయంలోనే వక్రబుద్ధి చూపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. మిత్రుడు కష్టాల్లో ఉన్నాడు అని తెలిసి ఆశ్రయమిచ్చాడు మరో స్నేహితుడు.
కానీ ఇలా ఆశ్రయమిచ్చిన స్నేహితుడి భార్యపైనే కన్నేసాడు ఆ మిత్రద్రోహి. దంపతులు ఏకాంతంగా ఉన్న సమయంలో రహస్యంగా వీడియోలు తీశాడు. ఇక ఆ తర్వాత ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని మిత్రుడి భార్యను బెదిరించి కోరిక తీర్చుకోవాలి అని అనుకున్నాడు. చివరికి ధైర్యం తెచ్చుకున్న బాధితురాలు షీ టీం కి ఫిర్యాదు చేయడంతో చివరికి నిందితుని అరెస్టు చేశారు. హైదరాబాద్ కూ చెందిన అబ్దుల్ సల్మాన్ తన మిత్రుడైన మరో యువకుడు ఇంట్లో కొంతకాలంగా ఉంటున్నాడు. స్నేహితుడి భార్య పైన కన్నేసాడు. ఇక దంపతులు ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియో తీసి వాటిని మిత్రుడి భార్యకు చూపించి కోరిక తీర్చాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. కానీ బాధితురాలు షీ టీంను ఆశ్రయించడంతో చివరికి అబ్దుల్ సల్మాన్ ను అరెస్టు చేశారు పోలీసులు.