భార్యను చంపాలని ఇనుప గేటుకు కరెంట్ షాక్.. కానీ చివరికి?

praveen
ఇటీవల కాలంలో కట్టుకున్న భార్యను ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన భర్త చివరికి కష్టాలపాలు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. మద్యానికి బానిసగా మారిపోతున్న ఎంతోమంది భర్తలు కుటుంబ బాధ్యతలను గాలికి వదిలేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు మద్యం తాగి వచ్చి ఇక కష్టసుఖాల్లో  తోడుంటానని ప్రమాణం చేసి మూడు ముళ్ళు వేసి ఇంట్లోకి ఆహ్వానించిన భార్యను దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఒకవేళ భర్త వేధింపులు తట్టుకోలేక భార్య పుట్టింటికి వెళ్ళిపోయిన అటు సైకోలుగా మారిపోతున్న భర్తలు భార్యలను అస్సలు వదలడం లేదు.


 వెరసి చివరికి ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడని ఘటనలు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది   అతను మద్యానికి బానిసగా మారిపోయాడు. రోజూ తాగొచ్చి ఆమెతో గొడవ పడుతూ చిత్రహింసలకు గురి చేసేవాడు. ఇక కొన్నాళ్లపాటు భర్త వేధింపులు భరించిన భార్య సహనం నశించి పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే భార్య పుట్టింటికి వెళ్లడాన్ని అవమానంగా భావించిన భర్త ఎలాగైనా చంపాలని ప్లాన్ చేశాడు.


 కాని చివరికి ప్లాన్ కాస్త బెడిసి  కొట్టింది అని చెప్పాలి. భార్యను చంపాలని చూస్తే ఆమె తల్లి ప్రాణాలు కోల్పోయింది. మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లా కోట్వారి పోలీస్ స్టేషన్ పరిధిలోని సైకేదా గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. నిత్యం తాగుతూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు ఒక వ్యక్తి. వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళింది సదర మహిళ. అత్తారింటికి వెళ్లి మరోసారి భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే భార్య ఎంతకీ తనతో రావడానికి అంగీకరించకపోవడంతో ఆమెను చంపాలని ప్లాన్ చేశాడు. బయట ఉన్న ఇనుప గేటుకు కరెంట్ కనెక్షన్ ఇచ్చాడు. భార్యకు బదులుగా ఆమె తల్లి వచ్చి గేటును ముట్టుకోవడంతో కరెంట్ షాక్ తో విలవిలలాడి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడితే అసలు విషయం వెలుగు చూసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: