ఓరి నాయనో.. అంబులెన్స్ ఇలా కూడా వాడతారా?

praveen
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్న కొన్ని తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కొంతమంది మనుషులు ప్రవర్తిస్తున్న తీరు అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఇటీవలి కాలంలో దొంగల బెడద ఎక్కడ చూసినా కాస్త ఎక్కువగానే ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక దొంగతనం చేయడానికి అటు ఎంతో మంది వ్యక్తులు ఎంచుకుంటున్న దారులు అందరికీ ముక్కున వేలేసుకునేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. మరి కొంతమంది చిత్రవిచిత్రమైన చోరీలకు పాల్పడుతు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉన్నారు.

 మొన్నటికి మొన్న ఒక వ్యక్తి ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియక చివరికి ఆర్టీసీ బస్సు దొంగతనం చేసి.. ఇక ఆ బస్సులో ఇంటికి చేరుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ తర్వాత ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఇలాంటి మరో విచిత్రమైన ఘటనే జరిగింది అని చెప్పాలి. సాధారణంగా ఇంటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు జేబులో డబ్బులు లేకపోతే ఎవరైనా లిఫ్ట్ అడిగి వెళుతూ ఉంటారు లేదా  మరో ఉపాయం చేస్తూ ఉంటారు.  కానీ ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి ఇంటికి వెళ్లడానికి ఏకంగా ఒక దొంగ గా మారిపోయాడు.

 ఈ క్రమంలోనే ఒక ప్రభుత్వ అంబులెన్స్ను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. హయత్నగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద అంబులెన్స్ ను పెట్టిన డ్రైవర్ మూత్ర విసర్జన కు వెళ్ళాడు. అయితే అతను తిరిగి మళ్ళీ వచ్చే సరికి అంబులెన్స్ కనిపించలేదు.  దీంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు.  ఇక వెంటనే జరిగిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు అంబులెన్స్ డ్రైవర్. జీపీఎస్ ట్రాకింగ్ ఆధారంగా ఇక అంబులెన్స్ ఎక్కడ ఉంది అన్న విషయాన్ని కనుగొన్నారు పోలీసులు. అంబులెన్స్ ఎందుకు దొంగలించావ్ అంటూ నిందితుడిని అడుగగా ఇంటికి వెళ్లేందుకు డబ్బు లేకపోవడంతో అంబులెన్స్ దొంగలించి అందులో వెళ్లాను అంటూ అతను సమాధానం చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: