భర్తను అందరి ముందు చెప్పుతో కొట్టిన భార్య.. ఎందుకో తెలుసా?
ఒకే శాఖలో పనిచేస్తున్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. చివరికి భార్యకు అటు బంధువులు ఎవరికి కూడా తెలియకుండా రాసలీలలు కొనసాగిస్తూ వచ్చారు. కానీ ఓ రోజు భార్య బంధువులు కలిసి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి సమయంలో కాళ్లు మొక్కి గౌరవం ఇచ్చిన భార్య తనకు మోసం చేసిన భర్తను అందరి ముందు దేహశుద్ధి చేసి చెప్పుతో కొట్టింది. ఈ ఘటన వరంగల్ మండలం పైడిపల్లి లోని ఆర్టీసీ కాలనీ లో వెలుగు చూసింది.
హనుమకొండ లోని కుమార్ పల్లె ప్రాంతానికి చెందిన జీవన అనే వ్యక్తి వరంగల్ కార్పొరేషన్లో సూపరిండెంట్ గా పని చేస్తున్నాడు. కానీ నాలుగేళ్ల క్రితం సస్పెన్షన్కు గురయ్యాడు. అయితే అదే సంస్థ లో పని చేస్తున్న ఓ వివాహిత తో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. 2018లో అతనికి వివాహమైంది. భార్యతో కలిసి సంతోషం గా ఉన్నప్పటికీ వివాహేతర సంబంధాన్ని మాత్రం వదులు కోలేదు. ఇటీవలే అదనపు కట్నం కోసం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. భర్త ప్రవర్తనతో మార్పు రావడంతో నిఘా పెట్టిన భార్య భర్త అక్రమ సంబంధం గురించి తెలుసుకుంది. భర్త ప్రియురాలితో కలిసి ఉన్న సమయంలో బంధువులతో కలిసి ఉండగా పట్టుకుని చెప్పు తో కొట్టిన తర్వాత పోలీసులకు పట్టించింది.