
చీమలు దండయాత్ర.. గ్రామాలు ఖాళీ చేస్తున్న జనం.. ఎక్కడంటే?
ఇక ఇప్పుడు తమిళనాడులోని పలు గ్రామాలలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది అని తెలుస్తోంది. అక్కడి గ్రామాలపై ఏకంగా చీమలదండు దండెత్తాయ్. ఈ క్రమంలోనే కనిపించిన ప్రతి వస్తువును తినేస్తున్నాయి. దీంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఈ చీమల దండయాత్ర కారణంగా ఏం జరుగుతుందో అని భయపడి ఏకంగా గ్రామాలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. కరెంత మలై రిజర్వ్ ఫారెస్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎల్లో క్రేజీ యాంట్స్ అనే చీమలు విజృంభిస్తున్నాయి.
అడవుల్లో ఉండే ఈ చీమలు చివరికి గ్రామాల్లో కి కూడా వచ్చి భయాందోళనకు గురిచేస్తున్నాయి.
స్థానికంగా ఉండే చీమలపుట్ట లను ఇవి ఆక్రమిస్తూ కీటకాలు పురుగులు తినేస్తున్నాయి. ఇక్కడి వరకు ఓకే కానీ ఏకంగా ఇంట్లో ఉన్న పదార్థాలను కూడా తినేస్తూ మనుషులను కూడా కుడుతున్నాయి. ఇలా సుమారు ఏడు గ్రామాలపై చీమలు దండయాత్ర చేసి పంట పొలాలను కూడా నాశనం చేశాయని చెప్పాలి. ఎలుకలు పిల్లులు కుందేళ్లు పాములు బల్లులను కూడా వదలడం లేదు. గుంపులుగా చుట్టుముట్టి ప్రాణాలు తీసేస్తూ ఉన్నాయి. ఈ ఘటన కాస్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. చీమల మందు చల్లుతున్న కూడా ఉపయోగం ఉండటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రపంచంలోనే 100 ప్రమాదకరమైన చీమ జాతులలో ఇది కూడా ఒకటని అధికారులు హెచ్చరిస్తూ ఉండటం గమనార్హం. నివారణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు అధికారులు.