పొలంలో నిద్రిస్తున్న మహిళ.. అక్కడికొచ్చి పడగవిప్పిన పాము.. చివరికి?

praveen
సాధారణంగా పాములు కేవలం అడవులు కొండలు గుట్టల్లో మాత్రమే సంచరిస్తూ ఉంటాయి. కానీ కొన్ని కొన్ని సార్లు దారితప్పి జనావాసాల్లోకి వస్తూ ఉంటాయి. ఇలా జనావాసాల్లోకి వచ్చిన సమయంలో పలువురు ని కాటు వేయడం కారణంగా ఎంతోమందినీ  ప్రమాదంలో పడేస్తూ ఉంటాయ్. మరికొన్ని సార్లు ఇక పాములు జనాల కంటపడి చివరికి  ప్రమాదంలో పడి ప్రాణాలు కోల్పోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలా పాములు జనావాసాల్లోకి వచ్చినప్పుడు తమకు ఎలాంటి అపాయం చేస్తుందో అని భయపడి  ప్రాణాలను తీసేస్తూ ఉంటారు జనాలు. ఇలాంటి ఘటనలు వర్షాకాలంలో కాస్త ఎక్కువగానే తెరమీదికి వస్తూ ఉంటాయి.


 ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఉలిక్కి పడతారు అని చెప్పాలి. సాధారణంగా ఎంతో మంది రైతులు పొలం వద్దకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసుకున్న ఒక మంచం మీద నిద్రించడం  లాంటివి చేస్తూ ఉంటారు.  ఇక్కడ ఓ మహిళ కూడా పొలం వద్ద ఉన్న నిద్ర లోకి జారుకుంది. ఇలాంటి సమయంలో అక్కడికి ఒక పెద్ద నాగుపాము వచ్చింది. ఆమె వీపు మీద ఎక్కి కూర్చుంది. ఈ ఘటన కర్ణాటకలోని కలబురగి జిల్లాలో వెలుగుచూసింది. మల్లా బాద్ కు చెందిన భాగమ్మ అనే మహిళ పొలంలో పడుకుంది. అప్పుడు ఆమె పైకి నాగు పాము పడగ విప్పి బుస కొట్టింది. కానీ ఆ మహిళకు మెలుకువ రాలేదు. కానీ దూరంగా ఉన్నవారు చూసి గట్టిగా అరవడంతో ఒక్కసారిగా నిద్ర లోనుంచి లేచింది.


 తన వీపు పై ఉన్న పామును చూసి ఒక్కసారి భయంతో ఊగిపోయింది. ఈ క్రమంలోనే పదేపదే శివుడిని బిగ్గరగా తలచుకోవడం మొదలుపెట్టింది. ఇక ఆ తర్వాత ఆ దేవుడే అనుగ్రహించాడో ఏమో కానీ ఆ తర్వాత అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోయింది అని చెప్పాలి. ఇదంతా అక్కడున్న వారు చూసి ఒక్క సారిగా షాక్ అయ్యారు అని చెప్పాలి. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు నిజంగా ఆమె కు అదృష్టం బాగానే ఉంది.. లేదంటే బుసలు  కొట్టిన పాము సైలెంట్ గా వెళ్లి పోయింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: