అక్రమసంబంధం మంచిదికాదన్న కూతురు.. ఆ మహిళ ఏం చేసిందో తెలుసా?

praveen
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధం ఎన్నో దారుణాలకు కారణమవుతుంది. పెద్దల సాక్షిగా వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన వారు ఒకరికి ఒకరు తోడుగా ఉండాల్సింది పోయి  పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి కాపురంలో చేజేతులారా చిచ్చు పెట్టుకుంటున్నారు. అంతే కాదు ఏకంగా క్షణకాల సుఖం కోసం పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి సొంత వారి ప్రాణాలు తీసేందుకు కూడా సిద్ధమైపోతున్నారు అని చెప్పాలి. సుఖం కోసం కట్టుకున్న బంధాన్ని కన్నా బంధాన్ని కూడా లెక్క చేయడం లేదు. వెరసి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటన చూసిన తర్వాత సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడింది.


 ఈ క్రమంలోనే ఇక్కడ కూడా ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధం మాయలో పడి పోయిన మహిళా రక్తం పంచుకుని పుట్టిన కన్న కూతురి విషయంలో కూడా కాస్తయినా జాలీ దయా చూపించలేకపోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న  కూతురు కంటే ప్రియుడితో సుఖమే ఎక్కువ అని భావించిన మహిళ చివరికి అక్రమ సంబంధానికి అడ్డు వస్తుంది అనే కారణంతో కూతురు ని దారుణంగా చంపేసింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ సరిహద్దులోని తిక్రి పోలీస్ స్టేషన్ పరిధిలో 48 ఏళ్ల మహిళ పద్దెనిమిదేళ్ల హరీష్ కుమార్ ఒక ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు.


 అక్కడే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి గా పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. గత కొన్ని రోజుల నుంచి రాసలీలల్లో మునిగి తేలుతున్నారు ఇద్దరు.  కూతురికి విషయం తెలిసింది. అలా చేయడం తప్పని ఇప్పటికైనా ఇలాంటి పనులు మానుకోవాలి అంటూ పెళ్లికి సూచించింది కూతురు.  కాని ఆ విషయం ఆ మహిళకు నచ్చలేదు. ఇదే విషయం ప్రియుడు హరీష్ కుమార్ కు చెప్పడంతో అతను బాలిక మీద కత్తితో దాడి చేసి గొంతు కోసి చంపేశాడు. ఇక స్థానికులు అప్రమత్తమై యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించగా విచారణలో తల్లి కూతురునీ చంపించింది అనే విషయం తేలింది. దీంతో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: